తెలంగాణ

telangana

ETV Bharat / health

మొలకలు తింటున్నారా? - మరి, ఈ ప్రమాదాల గురించి తెలుసా? - Sprouts Side Effects

Sprouts Side Effects : మీకు డైలీ మొలకలు తినే అలవాటు ఉందా? ఆరోగ్యం కోసమని రోజూ తింటున్నారా? మరి.. పొంచి ఉన్న ఈ ప్రమాదాల గురించి మీకు తెలుసా?

Health Benefits of Sprouts
Sprouts Health Benefits (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 1:47 PM IST

Sprouts Disadvantages :శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందాలంటే.. డైలీ కాసిన్ని మొలకలు(Sprouts) తినడం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతూనే ఉంారు. మొలకల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండి కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయని చెబుతారు. అయితే.. ఇవి అందరి విషయంలో ఒకే విధంగా పనిచేయవని, కొందరిలో ప్రమాదకరంగానూ మారుతాయని నిపుణులు చెబుతున్నారు.

  • మొలకలలో విటమిన్ సి, ఫైబర్, జింక్, ఇనుము, కాల్షియం, ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • మొలకల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.
  • ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మొలకలు చాలా సహాయపడతాయంటున్నారు.
  • 2017లో "Nutrition, Metabolism and Cardiovascular Diseases" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు వంటి ఆహారాలను తినే వ్యక్తులు మలబద్ధకంతో బాధపడే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాకు చెంది ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ లీ పాల్గొన్నారు. మొలకలు తినడం వల్ల అందులో పుష్కలంగా ఉండే ఫైబర్, మరికొన్ని పోషకాలు జీర్ణ సమస్యలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.

మొలకెత్తిన మెంతులతో - షుగర్​కు చెక్​ పెట్టేయండి! - Sprouted Fenugreek Seeds Benefits

  • ఈ మొలకల ద్వారా బాడీలో హెచ్‌డిఎల్ స్థాయి పెరుగుతుంది. అంటే.. శరీరంలో 'మంచి కొలెస్ట్రాల్' పెరగడానికి ఈ మొలకలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందంటున్నారు.
  • అలాగే.. రక్తపోటు కంట్రోల్​లో ఉంటుందని సూచిస్తున్నారు. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయంటున్నారు.
  • మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండే విటమిన్ సి, మరిన్ని పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పడతాయట.
  • వీటిలో ఉండే విటమిన్ ఏ కంటిశుక్లం, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
  • మొలకలు తినడం వల్ల శరీరానికి విటమిన్ బి లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా స్కిన్​ని హైడ్రేట్​గా ఉంచడంలో సహాయపడుతుందంటున్నారు.

నష్టాలు ఇలా...

  • మొలకల ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతిగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఒక రోజులో గుప్పెడు లోపు తినాలని సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా సరైన పద్ధతిలో మొలకలు తయారు చేసుకోవడం చాలా అవసరం. సరిగా శుభ్రం చేయని గింజలతో, గింజల్ని చుట్టే వస్త్రంతో ఫుడ్​ పాయిజన్​ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
  • నాణ్యత లేని మొలకలు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు రావొచ్చంటున్నారు. వాంతులు, విరేచనాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంటున్నారు నిపుణులు.
  • మొలకల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు మొలకల తీసుకోవడం గురించి వైద్యుడితో మాట్లాడాలని సూచిస్తున్నారు.
  • కొన్ని రకాల మొలకల్లో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి.. రక్తం పలుచగా కావడానికి మందులు వాడే వారికి ఇది సమస్యలు కలిగిస్తుంది. కాబట్టి.. వైద్యుల సూచన మేరకే మొలకలు తినాలని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఫుడ్స్​తో పోలిస్తే కోడిగుడ్డు నథింగ్ - ఫుల్​ ప్రొటీన్ - మీ కండరాలు యమా స్ట్రాంగ్ అవుతాయ్!

ABOUT THE AUTHOR

...view details