తెలంగాణ

telangana

ETV Bharat / health

వేసవిలో చెమటకాయలు, దురద వేధిస్తున్నాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి! - how to prevent summer rashes - HOW TO PREVENT SUMMER RASHES

Skin Rashes in Summer Home Remedies : వేసవిలో దద్దుర్లు, చెమటకాయలతో చాలా మంది ఇబ్బంది పడతారు. మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! ఎండాకాలంలో ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి సహజ సిద్ధంగా ఎటువంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Skin Rashes In Summer Home Remedies
Skin Rashes In Summer Home Remedies

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 11:39 AM IST

Skin Rashes in Summer Home Remedies :వేసవి కాలంలో ఒకవైపు ఎండవేడి, వడగాలులు, చెమట ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు దురద, చెమటకాయలు చికాకు పెడతాయి. కొంత మందిలో చర్మంపై దద్దుర్లు ఏర్పడి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చాలా మంది జనాలు సమ్మర్‌లో ఎన్నో రకాల స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొంటారు. మరి, ఈ చర్మ సమస్యలకు పరిష్కారం ఏంటో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

వేప నీళ్లు :
సమ్మర్‌లో దురద, చెమటకాయలు, చర్మం ఎర్రగా మారడం వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడేవారు రోజూ వేప నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే సమస్య పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వేప నూనె, వేప పేస్ట్‌ను కూడా చర్మానికి అప్లై చేసుకోవచ్చు. వేప నీటిలో ఉండే యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయని అంటున్నారు. అలాగే వేప నీటితో స్నానం చేయడం వల్ల మొటిమల సమస్య కూడా తగ్గుతుందట.

పరిశోధన వివరాలు :
2011లో 'ఫిటోథెరపీ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వేప నీటితో స్నానం చేయడం వల్ల మొటిమల తీవ్రత, చర్మంపై దద్దుర్లు తగ్గాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని "జామియా హమ్‌దర్ద్ విశ్వవిద్యాలయం"లో చర్మవ్యాధి నిపుణులుగా పనిచేసే డాక్టర్. ఎ.కె. గోయల్‌ (A.K. Goyal) పాల్గొన్నారు. వేపనీటితో స్నానం చేయడం వల్ల మొటిమల తీవ్రత, స్కిన్‌పై దద్దుర్లు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.

బేకింగ్‌ సోడా :
ఒక గిన్నెలో బేకింగ్‌ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌ చేసుకోవాలి. దీనినిచర్మంపై దురద ఉన్నచోట, దద్దుర్లు ఉన్న దగ్గర అప్లై చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ముల్తానీ మట్టితో :
సమ్మర్‌లో ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల దురద, దద్దుర్ల సమస్య తగ్గుతుంది. ముందుగా ముల్తానీ మట్టిని ఒక గంటసేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లను తీసేసి అందులో గంధం పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై ఎక్కడైతే దద్దుర్లు, దురద ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. అలాగే ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవడం వల్ల చర్మం తళతళ మెరుస్తుందని నిపుణులంటున్నారు. ఈ టిప్స్‌ పాటిస్తే ఎటువంటి పౌడర్‌లు వాడకుండా, సమ్మర్‌లో స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సమ్మర్​లోనూ మీ స్కిన్‌ మెరిసిపోవాలా ? ఈ సింపుల్​ టిప్స్‌ పాటిస్తే సరి!

చంకల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా ? అయితే ఈ టిప్స్ పాటించండి!

ABOUT THE AUTHOR

...view details