Side Effects Of Using Ice Cubes On Skin :ఈ మధ్య కాలంలో చర్మ సౌందర్యం కోసం ఐస్ ఫేషియల్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే.. ఐస్ క్యూబ్స్, ప్యాక్స్‌తో నేరుగా చర్మంపై మర్దన చేసుకోవడం. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ను చాలా మంది ఫాలో అవుతున్నారు. దీని వల్ల మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చని భావిస్తుంటారు. నిజానికి ఐస్ ఫేషియల్స్ వల్ల చర్మానికి కొంతమేర ప్రయోజనం ఉన్నప్పటికీ.. అతిగా వాడితే మాత్రం అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, చర్మానికి(Skin)ఐస్ రాయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమ్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐస్‌ని కేవలం ఫేషియల్స్ కోసం మాత్రమే కాదు కొందరు.. ఏదైనా గాయాలు అయినప్పుడు, మొటిమలు, ముఖం, కళ్ల వద్ద చర్మం ఉబ్బినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి యూజ్ చేస్తుంటారు. అయితే, ఇలా ఐస్‌ని యూజ్ చేసే వారందరూ ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఐస్ సంబంధిత క్యూబ్స్, రోలర్లు, ప్యాక్స్ వంటి ఎక్కువ వాడకుండా చూసుకోవాలంటున్నారు. ఎందుకంటే.. వీటిని అధికంగా వాడడం వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అవేంటంటే..
ర్యాషెస్ :అధిక సమయం పాటూ పదే పదే ముఖంపై ఐస్ క్యూబులతో మసాజ్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మం ఎరుపుగా మారి దురదలు, ర్యాషెస్ వంటి ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు. 2010లో "బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఐస్ ప్యాక్‌లను ఎక్కువసేపు ముఖంపై ఉంచడం వల్ల చర్మవాపు, దురద, చర్మానికి నష్టం కలగడం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో యూనివర్సిటీ ఆఫ్ కెంట్‌లో డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ రెడ్మోండ్ పాల్గొన్నారు. ఎక్కువ సమయం ఐస్ క్యూబ్స్ చర్మంపై అప్లై చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?