Side Effects of Salt on Body :మనం తీసుకునే ఆహారం అన్నిట్లోనూ ఉప్పును వాడుతుంటాం. అసలు ఉప్పు తక్కువగా ఉంటే నాలుకకి రుచే తగలడం లేదు అంటుంటారు. తినడానికి బాగానే ఉంటుంది కానీ ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు వైద్యులు. మోతాదుకు మించి ఉప్పు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని ఎన్నో రీసెర్చ్‌ల్లో వెల్లడైంది. ఏరూపంలోనైనా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీతో పాటు హార్ట్ ప్రొబ్లెమ్స్, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. అయితే మరి మనం ఉప్పు ఎక్కువ తింటున్నామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? మన శరీరంలో కనిపించే కొన్ని మార్పులు వల్ల వాటిని కనిపెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్లున్నారా? : షుగర్ సమస్య ఉండకోపోయిన తరచూ యూరిన్‌కు వెళ్లాల్సి వస్తున్నట్లైతే మీరు అవసరానికి మించి ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నట్లే అని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటే మాత్రం మన తీసుకునే ఆహారంలో ఉప్పు వాడకంపై కంట్రోల్ ఉండాల్సిందేనని కచ్చితంగా చెబుతున్నారు.
ఎక్కువగా దాహం వేస్తుందా? : ఆహారంలో లేదా ద్రవపదార్ధాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా నీటి స్థాయిలో సమతుల్యతపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల తరచూ మంచినీళ్లు తాగాల్సి వస్తుంది. అంతేకాక ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచూ యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గి తరచూ దాహం వేయడానికి ఇదీ ఒక కారణమే.
శరీరంలో కొన్ని చోట్ల వాపు : బీపీ ఎక్కువ ఉన్నవారి శరీరబాగంలో స్వెల్లింగ్రావడం కనిపిస్తుంది. అదే విధంగా ఉప్పు ఎక్కువగా తీసుకునే వారి బాడీలోనూ కొన్ని చోట్ల వాపు వస్తుంది. ఎక్కువగా పాదాల్లో నీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయి. మన తీసుకునే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గిస్తే ఇలాంటి సమస్యల బయటపడచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల నాలుకపై ఉండే టేస్టీ బడ్స్ మొగ్గలు ఇతర రుచుల్ని అంతగా గ్రహించలేవట. అందువల్ల ఏది తిన్నా అంత రుచికరంగా ఉండదంట. ఇలాంటివారు ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు తినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారట.
తిమ్మిర్లు, నొప్పులు: ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరిగిపోతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది క్యాల్షియం స్థాయి పైనా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందట. తద్వారా బోన్స్ కూడా బలహీనమవుతాయి. ఫలితంగా తిమ్మిర్లు, నొప్పుల వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి అంటున్నారు నిపుణులు. ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు నిపుణులు.
- నాన్ వెజ్ కొనేటప్పుడు దగ్గర ఉండి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసిన వాటినే తీసుకోవాలి. ఎందుకంటే ప్యాక్ చేసినవి పాడు కాకుండా ఉండేందుకు విక్రయదారులు వాటిలో ఉప్పును కలుపుతుంటారు.
- బయట మార్కెట్లో మనం ఏ ఐటమ్ కొన్నా అందులో సోడియం స్థాయి ఎంత ఉందో వాటికి అతికించే ఉండే లేబుల్ మీద ఉంటుంది. అది చూసి సోడియం తక్కువ ఉన్న ఐటెమ్స్నే తీసుకోవాలి.
- మసాలాలు తీసుకునేటప్పుడు సోడియం లేనివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఏదైనా హోటల్, రెస్టారెంట్లలో తిన్నప్పుడు, లేదంటే ఆన్‌లైన్ యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు సాల్ట్ తక్కువ ఉన్నవాటికే ప్రాధాన్యమివ్వాలి. అసలు ఆర్డర్ చేసేటప్పుడే కాస్త ఉప్పు తగ్గించి వేయమని చెబితే ఇంకా మంచిది.
- చైనీస్ వంటి ఆహారాల్లో ఎక్కువగా సాస్‌లు వాడతాం. వాటిలో కూడా సోడియం స్థాయి ఎక్కువగానే ఉంటుంది. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. సాస్‌ల ప్లేసులో బ్రెడ్‌పై పీనట్ బటర్ రాసుకోవడం వంటి అల్ట్రనేటివ్ మార్గాల్ని ఎంచుకుంటే సరిపోతుంది.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభించాలంటే - ఉప్పును ఇలా తీసుకోవాలంటున్న నిపుణులు! - Benefits of Drinking Salt Water
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? - మిమ్మల్ని ఈ వ్యాధులు ఎటాక్ చేస్తాయంటున్న నిపుణులు! - Side Effects of Salt in Body