తెలంగాణ

telangana

ETV Bharat / health

లిప్ కిస్ పెడుతున్నారా! - ఏం జరుగుతుందో తెలుసా? - Lip Lock Side Effects

Lip Kiss Side Effects : ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అయితే.. లిప్ టూ లిప్ కిస్ పెట్టడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఎక్కువే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Lip Kiss
Lip Kiss Side Effects

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 12:14 PM IST

Side Effects of Lip Lock : లవర్స్, లేదా భార్యాభర్తలు.. తమ పార్ట్​నర్​పై ఉన్న ఇష్టాన్ని కిస్​(Kiss) ద్వారా తెలియజేస్తుంటారు. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ.. అత్యంత గాఢమైన ముద్దు లిప్​ లాక్ మాత్రమే. ఈ ముద్దు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఆరోగ్యపరంగా నష్టాలు కూడా చాలానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తరచుగా లిప్​ లాక్​ వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ, లిప్ లాక్(Lip Lock) వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • అలర్జీ సమస్యలతో బాధ పడేవారు లిప్ కిస్​లకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు. ఎందుకంటే అలాంటి సమస్యలు ఉన్నవారు ముద్దు పెట్టడం వల్ల భాగస్వామికీ ఆ సమస్యల వచ్చే ప్రమాదం ఉందట. కొన్ని సర్వేల ప్రకారం.. లిప్ కిస్​ ఎక్కువగా చెయ్యడం వల్ల థ్రిల్ ఏమో గానీ అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
  • అలాగే ముద్దులు పెట్టుకోవడం వల్ల కొన్ని రకాల నోటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంటి, చిగుళ్ల సమస్యలు వంటివి తలెత్తే ఛాన్స్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • అదేవిధంగా దురద, వాపు వంటి సమస్యలతో బాధపడే వారూ లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. లిప్ కిస్ చెయ్యడం ద్వారా మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లు వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కొందరిలో మోనో వైరస్ కారణంగా విపరీతమైన అలసట వంటి లక్షణాలు తలెత్తవచ్చట.
    ముద్దులొలికే చిన్నారులకు ముద్దు పెడుతున్నారా? - వారి ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!
  • కొందరు అతిగా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకుంటారు. దీని కారణంగా క్లామిడియా గొనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చొని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా, ఒకరికి ఉన్న దీర్ఘకాలిక సమస్యలు మరొకరికి కూడా వచ్చే ప్రమాదం ఉందట. అదేవిధంగా, ముద్దులు పెట్టుకోవడం వల్ల న్యూమోనియా వంటి బ్యాక్టీరియా కూడా ట్రాన్స్​ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
  • 2017లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఫ్లూ ఉన్నవారు ఇతరులకు ముద్దు పెట్టడం వల్ల వారికి కూడా ఫ్లూ వచ్చే అవకాశం 95% ఎక్కువ అని వెల్లడైంది.
  • పెద్దలకు లిప్ కిస్ మాత్రమే కాదు.. చిన్నపిల్లలకు ముద్దు పెట్టడం వల్ల కూడా వారికి అనారోగ్యం వచ్చే ఛాన్స్ ఉందట. ఎందుకంటే.. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కిస్ పెట్టడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్ బారినపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Sreeleela Lip Kiss : 'మొదటి ముద్దు ఆయనకు ఇస్తాను'.. లిప్ లాక్ సీన్స్​పై శ్రీలీల క్రేజీ ఆన్సర్​

ABOUT THE AUTHOR

...view details