Salt Water Bath Benefits :ఉప్పు నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అదే ఉప్పు నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాల్ట్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుందనే మాటల్లో వాస్తవం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ప్రముఖ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అఖిలేష్ యాదవ్. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న వారు స్నానం చేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ వాడితే మంచి ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.
ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి?
వాస్తవానికి ఎప్సమ్ సాల్ట్ అనేది నిజంగా ఉప్పు కాదు. మెగ్నీషియం, సల్ఫర్, ఆక్సిజన్ కలయికతో ఏర్పడే ఓ ఖనిజాన్ని ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఇది కండరాల నొప్పి, వాపు, ఒత్తిడి, నిద్రలేమి వంటి అనేక రకాల సమస్యల నుంచి రక్షించే దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఉప్పు నీటితో స్నానం వెన్ను నొప్పిని ఎలా తగ్గిస్తుంది?
గోరు వెచ్చటి నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసినప్పుడు దాంట్లోని మెగ్నీషియం, సల్ఫర్ కరిగి శరీరం వాటిని సులువుగా గ్రహిస్తుంది. ఇవి కండరాలను సడలించడం ద్వారా శరీరంలోని రకరకాల చోట్ల కలిగే మంట, వాపు, నొప్పి సమస్యలు తగ్గుతాయి. శరీరాన్ని పునరుజ్జీవంచేసేలా వేడిప్రేరిత రక్త ప్రసరణ జరిగి ఈ సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. గోరు వెచ్చటి నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసుకుని స్నానం చేయడం వల్ల కండరాలు సడలింపు లభిస్తుంది. వెన్నుముకపై ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. నీటిలో ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి తగ్గి, ఫలితంగా కీళ్లు, వెన్నుముకపై ఒత్తిడి తగ్గుతుంది.