Rose Water Benefits For Skin : చర్మ సంరక్షణ కోసం తాపత్రయపడే వారికి ప్రకృతి ఇచ్చిన బహుమతి రోజ్ వాటర్. చర్మ నాణ్యతను పెంచగలగే సామర్థ్యం దీంట్లో అధిక మొత్తంలో ఉంటుంది. సున్నితమైన గులాబీ రేకుల నుంచి తయారుచేసే రోజ్ వాటర్ సహజ సౌందర్యాన్ని పెంపొందించి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా తయారయేలా చేస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. మార్కెట్లో దొరికే చాలా రకాల సౌందర్య సాధనాల్లో, సుగంధ ద్రవ్యాల్లోనూ రోజ్ వాటర్‌కు ప్రాముఖ్యత ఎక్కువ. హైడ్రేటింగ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నందున ఇవి దద్దుర్లు, చికాకులు వంటి వాటికి సహజ నివారణగా పనిచేస్తుంది.
మంచి సువాసన కలిగి ఉండే రోజ్ వాటర్ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని దూరం చేసి మానసిక స్థితిని కూడా మెరుగ్గా మార్చుతుంది. అంతేకాదు రెండు చుక్కల రోజ్ వాటర్ మీ వంటకాలకు, పానీయాలకు చక్కటి రుచిని అందించగలవు. ముఖ్యంగా స్వీట్లు, రీఫ్రెషింగ్ డ్రింక్స్‌లో దీన్ని వాడితే చక్కటి రుచి, సువాసన అందుతాయి. ఇవే కాకుండా రోజ్ వాటర్‌తో చర్మాన్నికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పీహెచ్ బ్యాలెన్స్!
రోజ్ వాటర్ సహజమైన టోనర్‌గా పనిచేస్తుంది. చర్మ సంరక్షణకు సహాయపడే పీహెచ్ సమతుల్యతను నియంత్రణలో ఉంచుతుంది. చర్మ రంధ్రాలను బిగించి, మొటిమలను తగ్గించి, మృదువైన ఛాయను ప్రోత్సహిస్తుంది. చర్మంపై ఉండే అదనపు నూనెలు, మలినాలను తొలగించి మంచి శోషణ అందిస్తుంది.
దురద, వాపులను!
రోజ్ వాటర్‌లో చర్మంపై వచ్చే వాపు, దురద వంటి వాటిని తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా మార్చి, చికాకులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా రోసేసియా, తామర వంటివి వచ్చినప్పుడు కలిగే ఎరుపు, దురద, వాపులను తగ్గిస్తాయి. చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచి, పునరుద్దరణను ప్రోత్సహిస్తుంది.
వృద్ధాప్య ఛాయలకు దూరంగా!
రోజ్ వాటర్ సహజమైన యాంటీ ఏజింగ్ సాధనంగా పనిచేస్తాయి. అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, ముఖంపై గీతలు, ముడతలు, మచ్చలు వంటి వాటిని నయం చేస్తాయి. రోజ్ వాటర్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల యవ్వనమైన, శక్తివంతమైన ఛాయను పొందచ్చు.