Google for India: గూగుల్ ఇటీవల తీసుకొచ్చిన సరికొత్త ఏఐ జెమిని లైవ్ ఫీచర్ ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఏటా నిర్వహించే గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా నేడు ఈ కీలక ప్రకటనలు చేసింది. ఈ సదుపాయాన్ని నేటి నుంచి హిందీలోనూ వినియోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. అలాగే, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
గూగుల్‌కు చెందిన జెమిని AIని 40 శాతం మంది వాయిస్ ఇన్‌పుట్ ద్వారా వినియోగిస్తున్నారని గూగుల్ తెలిపింది. కేవలం ఇంగ్లీష్‌కు మాత్రమే పరిమితమైన జెమిని లైవ్ వాయిస్ ఇన్‌పుట్ ఫీచర్‌ను.. నేటి నుంచి హిందీలోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. మరో 8 స్థానిక భాషలను త్వరలోనే జత చేస్తామని వెల్లడించింది. గూగుల్ ఏఐ ఓవర్‌వ్యూ సదుపాయం హిందీ భాషలో అందుబాటులో ఉండగా.. బెంగాలీ, తెలుగు, మరాఠీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది.
కాగా ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఇటీవల సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ఆధారిత టూ-వే వాయిస్ చాట్ ఫీచర్ 'గూగుల్ జెమినీ లైవ్'ను ప్రారంభించింది. ఈ సరికొత్త ఫీచర్‌తో టైప్ చేయకుండానే దేని గురించి అయినా మాట్లాడొచ్చు. ఈ ఫీచర్‌పై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గూగుల్ మరిన్ని కీలక ప్రకటనలు:
- గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా మరో 2 రియల్ టైమ్ వాతావరణ అప్‌డేట్స్ కనిపించనున్నాయి.
- బాగా మంచు కురియడం, వరదలు సంభవించిన సందర్భంలో ఈ రియల్ టైమ్ వెదర్ అప్‌డేట్స్ వాహనదారులకు పనికొస్తాయి.
- గూగుల్ పేలో UPI సర్కిల్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
- ఇకపై యూజర్లు తమ UPI అకౌంట్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
- గూగుల్ పే ద్వారా ఇకపై రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని గూగుల్ తెలిపింది.
- దీంతోపాటు గూగుల్ తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చని పేర్కొంది.
- ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్‌తో జత కట్టినట్లు తెలిపింది.
- గూగుల్ మ్యాప్స్‌లోని 170 మిలియన్ల ఫేక్ రివ్యూలను ఏఐ సాయంతో తొలగించినట్లు గూగుల్ ఈ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా తెలిపింది.
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు సూపర్ ఆఫర్- వారికి 24GB డేటా ఫ్రీ..! - BSNL Anniversary Offers
యాపిల్ దీపావళి సేల్ వచ్చేసిందోచ్- ఐఫోన్ ప్రియులకు ఇక ఆఫర్ల పండగే..! - Apple Diwali Sale Starts