ETV Bharat / entertainment

20 రోజల గ్యాప్​లో ఐదు మెగా హీరో సినిమాలు - ఇక బాక్సాఫీస్ దున్నుడే! - Mega Heroes Latest Upcoming Movies - MEGA HEROES LATEST UPCOMING MOVIES

Mega Heroes Latest Upcoming Movies : మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు హీరోలు తమ సినిమాలను రిలీజ్​ చేసేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఒక సినిమా రిలీజైన 20 రోజులకు మరో సినిమాతో, అది విడుదలైన 20 రోజులకు మరో చిత్రంతో ఇలా వరుసగా వస్తున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Mega Heroes Latest Upcoming Movies (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 5:47 PM IST

Mega Heroes Latest Upcoming Movies : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క కుటుంబం నుంచే దాదాపు తొమ్మిది మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్నారు. త్వరలోనే మరో మెగా వారసుడు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు హీరోలు తమ సినిమాలను రిలీజ్​ చేసేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఒక సినిమా రిలీజైన 20 రోజులకు మరో సినిమాతో, అది విడుదలైన 20 రోజులకు మరో చిత్రంతో ఇలా వరుసగా రానున్నారు!

సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వస్తుందంటే మెగా అభిమానుల్లో భారీ స్థాయిలో సందడి ఉంటుంది. మరి అలాంటిది మెగా హీరోలు వరుసగా క్యూ కడుతూ తమ సినిమాలను రిలీజ్ చేస్తే, అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. పండగ సంబరాలు చేసుకుంటుంటారు.

అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ మొదలుకుని రామ్​ చరణ్, పవన్ కల్యాణ్​​ వరకు ఇలా వరుసగా ఐదు మంది మెగా హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి క్యూలో నిలబడ్డారు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందంటే?

Varun Tej Matka Release Date : వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. కరుణ కుమార్ దర్శకుడు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్​తో హై బడ్జెట్ మూవీగా ఇది రూపొందుతోంది. నవంబర్ 14వ థియేటర్లలోకి విడుదల కానుంది.

Pushpa 2 Release Date : సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రానున్న చిత్రం 'పుష్ప 2'. చాలా కాలం నుంచి ఊరిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్​ షూటింగ్​ను జరుపుకుంటోంది.

Game Changer Release Date : ప్రముఖ దర్శకుడు శంకర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఇది కూడా చాలా కాలంగా అభిమానులను ఊరిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Viswambhara Release Date : ఇక మెగా ఫ్యామిలీ హెడ్​ మెగాస్టార్ చిరంజీవి - బింబిసార డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి కాంబోలో వస్తున్న చిత్రం విశ్వంభర. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ఇది విడుదల కానుంది. ఇందులో చిరుతో పాటు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోంది.

Hari Hara Veera Mallu Release Date : ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన 'హరిహర వీరమల్లు'తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఇది మాత్రం కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని రానుంది. 'విశ్వంభర' వచ్చిన దాదాపు 50 రోజులకు రానుంది. మొత్తానికి ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం గమనార్హం. పైగా ఒక సినిమా రిలీజైన 20 రోజులకు మరో సినిమా రానుంది.

'పుష్ప 2' క్లైమాక్స్​ లేటెస్ట్​ అప్డేట్​ - షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే? - Pushpa 2 Shooting Update

'భారతీయుడు' టీమ్ షాకింగ్ డెసిషన్​! - నిజంగానే అలా చేస్తుందా? - Bharateeyudu 3 OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.