ETV Bharat / health

అలర్ట్ : అన్నం తింటూ చేసే ఈ ఒక్క పనివల్ల - క్యాన్సర్​ ముప్పు 41 శాతం పెరుగుతుందట! - Salt and Gastric Cancer - SALT AND GASTRIC CANCER

Salt Side Effects : మనిషి ఆరోగ్యానికి భోజనమే ఔషధం. కానీ.. తేడాగా తింటే అదే విషంగా కూడా మారుతుంది. భోజనం చేస్తున్నప్పుడు చేసే ఒకే తప్పు వల్ల.. క్యాన్సర్​ ముప్పు ఏకంగా 41 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Salt Side Effects
Salt Side Effects (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 5:15 PM IST

Relation Between Salt and Gastric Cancer: ఉప్పు లేకపోతే వంటలకు రుచి రాదు. అదే సమయంలో ఉప్పు ఎక్కువ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా.. రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే.. క్యాన్సర్​ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా చాలా మంది కూరలో ఉప్పు తక్కువైతే అన్నం తినేటప్పుడు కలుపుకుంటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్‌ ఐదోది. దీని ముప్పు కారకాలను గుర్తించటానికి డాక్టర్లు, నిపుణులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయనం ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది.

భోజనానికి కూర్చున్నప్పుడు అదనంగా అసలే ఉప్పు కలపని, ఎప్పుడో గానీ ఉప్పు వేసుకునేవారితో పోలిస్తే తరచూ ఉప్పు కలిపి తినేవారికి గ్యాస్ట్రిక్​ క్యాన్సర్‌ ముప్పు 41% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయం లోపల జిగురుపొరను ఉప్పు దెబ్బతీస్తుంది. ఇది హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌ తలెత్తటానికే కాకుండా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయటం వంటి చర్యలతో క్యాన్సర్‌ ముప్పూ పెరిగేలా చేస్తుంది. కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవటానికి ఉప్పు తక్కువగా వాడటం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు అధికంగా గలవారికిది మరింత ముఖ్యమని వివరిస్తున్నారు.

2011లో ఇంటర్నేషనల్​ జర్నల్​ ఆఫ్​ క్యాన్సర్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక, మధ్యస్తంగా ఉప్పు తీసుకునే వ్యక్తులకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సియోల్​ నేషనల్​ యూనివర్సిటీలో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ప్రివెంటివ్​ మెడిసిన్​లో ప్రొఫెసర్​ డాక్టర్​ డేహీ కాంగ్ పాల్గొన్నారు. ఇదే విషయాన్ని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ బృందం(రిపోర్ట్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి) కూడా వెల్లడించింది.

ఇతర ఆరోగ్య సమస్యలు:

అధిక రక్తపోటు: శరీరంలో ఉప్పు శాతం పెరిగితే.. అది రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి హైపర్‌టెన్షన్​కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు.. గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. తలనొప్పి, తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయన్నారు.

తరచూ మూత్రం : ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే కాకుండా మూత్రం ముదురు రంగులోకి మారి దాని పరిమాణం కూడా తగ్గుతుందన్నారు. ఫలితంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి.. ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని వివరించారు.

అలసట, బలహీనత: ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత, అలసట వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు చేసే పనిపైనా ఏకాగ్రత పెట్టలేమని తెలిపారు. ఫలితంగా శరీర సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఉప్పు ఎక్కువ తింటున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే ప్రమాదంలోకి నెడుతున్నట్లు!

ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? - మిమ్మల్ని ఈ వ్యాధులు ఎటాక్​ చేస్తాయంటున్న నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.