Red Banana Health Benefits:ఎర్రటి అరటి పండులో పోషకాలు చాలా ఎక్కువ. వీటిలో ముఖ్యంగా పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తగినంత ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B1, B2, కోలిన్, కిబోలేట్, కెరోటినాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లు తింటే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది: ఎర్రటి అరటిపండ్లలోని బీటా-కెరోటిన్, విటమిన్ సి పురుషులలో సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇందులో ఉండే జింక్.. మగాళ్లలో ప్రోస్టేట్ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. 2017 లో Fertility and Sterility జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రెడ్ బనానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ డిఎన్ఏను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.
చర్మ ఆరోగ్యానికి మేలు:ఎర్రటి అరటిపండ్లలోని విటమిన్ సి, కెరోటినాయిడ్స్ వృద్ధాప్య సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మం, జుట్టుకు కీలకమైనది. ఇంకా.. కొల్లాజెన్ చర్మం ముడతల పడకుండా నిరోధిస్తుంది. స్కిన్‌ను హైడ్రేట్‌గా ఉంచుతుంది.
అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!
దృష్టిని మెరుగుపరుస్తుంది:ఎర్రటి అరటిపండ్లలో లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసు సంబంధిత మచ్చల క్షీణత (AMD), కంటి సమస్యల నుంచి లుటీన్ రక్షిస్తుంది. లుటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల AMD ముప్పు 26% వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. పసుపు అరటి పండుతో పోలిస్తే.. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ Aగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకం. 2017 లో Investigative Ophthalmology and Visual Science జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రెడ్ బనానాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.