Raw Mango Vs Ripe Mango :కొందరు.. పచ్చి మామిడిని(Raw Mango) తినడానికి ఇష్టపడితే, మరికొందరు.. పండిన మామిడిపండ్లను తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి, ఈ రెండింటిలో దేంట్లో ఎక్కువ పోషకాలుంటాయి? ఏవి ఆరోగ్యానికి బెటర్? అనేది మీకు తెలుసా? వీటికి సమాధానం తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
పచ్చి మామిడి ఆరోగ్య ప్రయోజనాలు :
- పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే.. పండిన మామిడి పండ్లతో పోలిస్తే ఇవి ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ సుహాని అగర్వాల్ చెబుతున్నారు. ఫలితంగా ఇవి జీర్ణశక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు.
- ముఖ్యంగా పచ్చి మామిడిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్కు మద్దతు ఇస్తుందంటున్నారు వైద్యులు.
- మామిడికాయలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.
- అదేవిధంగా పచ్చి మామిడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయని డాక్టర్ అగర్వాల్ సూచిస్తున్నారు.
- 2020లో 'జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. పచ్చి మామిడిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని, ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో చాలా బాగా సహాయపడతాయని కనుగొన్నారు.
పచ్చి మామిడికాయలు తింటే వెయిట్ లాస్- ఈ లాభాలు తెలుసా? - Benefits of Eating Raw Mango
పండిన మామిడి ఆరోగ్య ప్రయోజనాలు :
- పండిన మామిడి పండ్లలో బీటా-కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్, వివిధ ఫినోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు గణనీయమైన స్థాయిలో ఉంటాయంటున్నారు వైద్యులు.
- ఈ యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని డాక్టర్ అగర్వాల్ సూచిస్తున్నారు.
- 2018లో 'ఫుడ్ ఫంక్షన్'అనే జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పండిన మామిడిలో యాంటీఆక్సిడెంట్లు, పాలిఫెనోల్స్ పుష్కలంగా ఉన్నాయని, ఇవి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు కనుగొన్నారు.
- అదేవిధంగా.. మామిడి పండ్లలో ఉండే బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత వంటి కొన్ని రకాల వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయంటున్నారు.
- పండిన మామిడిపండ్లలో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన దృష్టి, రోగనిరోధకవ్యవస్థ పనితీరు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
- మామిడి పండ్లు ఎక్కువ మొత్తంలో సహజమైన చక్కెరలను కలిగి ఉంటాయి. ఫలితంగా ఇవి రుచిలో తీపిగా ఉంటాయి. కాబట్టి.. ఎక్కువ చక్కెర ఉండే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మామిడిపండ్ల విషయంలో కాస్త అలర్ట్గా ఉండడం మంచిదని డాక్టర్ సుహాని సేథ్ అగర్వాల్ సూచిస్తున్నారు.