Pre and Post Wax Care Tips: చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకుని అందంగా కనిపించాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం పార్లర్‌కు వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. ఎక్కువ రోజులపాటు పలకరించకుండా ఉంటాయని నొప్పిని భరించి మరీ చేయించుకుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది వ్యాక్స్ ముందు, వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
Pre Wax Care Tips:
వ్యాక్సింగ్ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వ్యాక్స్‌కి ముందు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. లేదంటే చెమట, దుమ్ము వంటివి వాక్స్‌ని శరీరానికి సరిగ్గా అతుక్కోనివ్వవు.
- దీని వల్ల మళ్లీ మళ్లీ వ్యాక్స్ చేయించుకోవాల్సి రావొచ్చు. దీంతో నొప్పి అదనం. అందుకే వ్యాక్స్ చేయించుకునే ముందు శుభ్రత కచ్చితంగా అవసరం.
- వ్యాక్స్ చేయించుకోవడానికి కనీసం వారం రోజుల ముందు వరకూ ట్రిమ్మింగ్, షేవింగ్ లాంటి పనులు చేయొద్దు. వెంట్రుకలు కాస్తయిన పొడవు పెరగకపోతే వ్యాక్స్‌కి ఇబ్బందవుతుంది.
- చర్మంపై గాయాలు, అలర్జీ, దద్దుర్లు ఉంటే వ్యాక్సింగ్ చేయించుకోవడాన్ని వాయిదా వేసుకోవడమే మేలని అంటున్నారు. అందం కోసమని వాటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
- చర్మం పొడిబారినా నొప్పి, మంట పెరుగుతాయి. కాబట్టి.. తేమనందించే క్రీములు తప్పక రాయాలి. అయితే వ్యాక్స్ చేయించుకునే రోజు, ఆ ముందు రోజు మాత్రం ఏవీ వాడొద్దు.
- ఇంట్లో స్వయంగా చేసుకుంటున్నా.. పరికరాలు శుభ్రంగా ఉన్నాయా అన్నది గమనించుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి, ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది.
సమ్మర్‌లో క్యారెట్ ఫేస్‌ప్యాక్స్ - ఇవి ట్రై చేశారంటే ముఖం తళతళా మెరిసిపోద్ది!