Piles Symptoms and How to Cure : పైల్స్.. తెలుగులో మొలలు అంటారు. వీటి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. బాధితుడికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. పైల్స్ ఉన్నవారు ఎక్కువ దూరం నడవలేరు, కూర్చోలేరు. నానా అవస్థలు పడుతుంటారు. మరి, ఈ సమస్య ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పైల్స్ అంటే ఏమిటి?:మలద్వారం వద్ద ఏనల్ కుషన్స్ ఉంటాయి. మలం గట్టిగా, రాయిలా వచ్చినప్పుడు ఆ ఏనల్ కుషన్స్ కిందకు జారతాయి. దీనినే పైల్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో హెమరాయిడ్స్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. అవి.. అంతర్గత మొలలు, బాహ్య మొలలు.
అంతర్గత మొలలు:అంతర్గత పైల్స్ బయటకు కనిపించవు. అవి పురీషనాళం లోపలి గోడల వెంట ఉంటాయి. అక్కడ ఎక్కువ నరాలు ఉండవు కాబట్టి పెద్దగా నొప్పి ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ అంతర్గత మొలలను మలవిసర్జన సమయంలో, శుభ్రం చేసుకునేటప్పుడు గుర్తించవచ్చు. అయితే ఇవి వాటంతట అవే లోపలకు వెళ్లి యథాస్థానానికి చేరిపోతాయి.
బాహ్య పైల్స్:ఇవి పాయువు చుట్టూ, చర్మం కింద భాగంలోనే ఉంటాయని.. అక్కడ నరాలు ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి బాగా ఉంటుందని అంటున్నారు. రక్తస్రావం, దురద, నొప్పి, వాపు.. వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. రక్తం గడ్డకట్టి నీలం రంగులోకి మారుతుంది. గడ్డకట్టిన రక్తం కరిగినప్పుడు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పైల్స్ రావడానికి కారణాలు:
- మానసిక ఒత్తిడి, మద్యపానం వల్ల కూడా మొలలు వస్తాయి.
- ఎక్కువ సేపు ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల పైల్స్ వస్తాయి.
- వయసు పైబడిన వారిలో, టాయిలెట్లో ఎక్కువ సేపు కూర్చున్న కూడా ఇవి వస్తాయి.
- గట్టిగా నిరంతరంగా దగ్గేవారిలో కూడా మొలలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
- అధిక బరువు పొట్టపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది పురీషనాళంలోని రక్త నాళాలపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ కారణంగా కూడా మొలలు వచ్చే అవకాశం.
- మహిళలకు గర్భధారణ సమయంలో కూడా మొలలు వస్తాయి. అయితే ఇవి డెలివరీ తర్వాత తగ్గిపోతాయి.
బీ అలర్ట్: భోజనానికి ముందు, తర్వాత చాయ్ తాగుతున్నారా? - ICMR Instruction to Avoid Tea