Parkinson Disease Causes and Symptoms: తల, చేతులు, కాళ్లు ఒకటే వణుకుతాయి.. నడక నెమ్మదిస్తుంది.. మాట నిదానమవుతుంది.. కండరాలు బిగుసుకుపోతాయి.. ఇవి చాలవన్నట్టుగా క్రమంగా మతిమరుపు, నిద్ర సమస్యలు, కుంగుబాటు కమ్ముకొస్తాయి. మొత్తంగా జీవితమే మొద్దుబారిపోతుంది! ఈ ప్రమాదకర లక్షణాలన్నీ కలిపితే.. పార్కిన్‌సన్ వ్యాధి. అసలు ఈ వ్యాధి ఎందుకొస్తుంది? లక్షణాలు ఏంటి..? చికిత్స విధానమేంటి? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..
What is Parkinson:పార్కిన్‌సన్ అనేది న్యూరోడెజెనరేటివ్ వ్యాధి. 1817లో మొదటిసారిగా డాక్టర్ జేమ్స్ పార్కిన్‌సన్ ఈ వ్యాధి గురించి వివరించారు. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ, శరీర కదలికలను నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. బాడీ పార్ట్స్‌ను నియంత్రించే మెదడులోని ఒక భాగంలో ఉన్న డోపమైన్-ఉత్పత్తి చేసే న్యూరాన్‌లపై ఈ వ్యాధి దాడి చేస్తుంది. ఇది వచ్చిన వారిలో చేతులు, తల వణుకుతాయి. బాడీలో దృఢత్వం (Stiffness) లోపిస్తుంది.. చక్కగా నడవలేరు.
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే - మీకు షుగర్ వ్యాధి రాబోతున్నట్టే!
పార్కిన్‌సన్ కారకాలు:
- వయసు:దాదాపు 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది.
- జన్యుశాస్త్రం: కుటుంబంలో ఎవరైనా దీని బారిన పడితే.. ఫ్యామిలీలో మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.
- జెండర్:ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.
- గాయాలు: తలకు దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
పార్కిన్‌సన్ లక్షణాలు: ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభదశలో కనిపించవు. 80% న్యూరాన్‌లు దెబ్బతిన్న తర్వాతనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఇందులో కూడా రెండు రకాల లక్షణాలు ఉన్నాయి. 1. మూవ్మెంట్ 2. నాన్ మూవ్మెంట్.