Over Weight Cause Paralysis Risk in Women :ఆడ, మగ అనే తేడాలేకుండా అందరిలోనూ సకల రోగాలకు కారణం.. "ఊబకాయం". దీనివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే.. వృద్ధాప్యంలో వచ్చే పక్షవాతం కూడా.. అధిక బరువు కారణంగా మధ్యవయసులోనే వచ్చే ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు. "అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్" పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.
పరిశోధనలో ఆసక్తికర విషయాలు :
అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ చేపట్టిన ఈ పరిశోధనను ఫిన్‌లాండ్‌లో నిర్వహించారు. మొత్తం 50 సంవత్సరాల ఆరోగ్య సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. 14 ఏళ్ల వయసులో అధిక బరువు గల మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. వీళ్లు 31 ఏళ్ల వయసులో బరువు తగ్గినా ఈ ముప్పు పొంచి ఉంటుందట. అలాగే 14 ఏళ్ల వయసులో మామూలు బరువుండి, 31 ఏళ్ల వయసులో బరువు పెరిగినా పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.
టీవీ రిమోట్ - స్నాక్స్ : నష్టం జరిగే ముందు అర్థంకాదు - జరిగిన తర్వాత అర్థమైనా ఉపయోగం లేదు!
ఎత్తు, బరువుల నిష్పత్తితో :
వయసు, ఎత్తు, బరువుల నిష్పత్తిని పోలుస్తూ కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారట. సాధారణంగా పక్షవాతానికి.. అధిక రక్తపోటు, మధుమేహం, పొగతాగే అలవాటు వంటివి కారణం అవుతాయి. ఈ లిస్టులో ఊబకాయం కూడా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.