Natural Ways To Tighten Neck Skin :మెడ చుట్టూ నల్లటి వలయాలు, ముడతలు, చర్మం వదులుగామారి సన్నని గీతలు రావడం.. వంటివి కొంతమందిని ఇబ్బందిపెడుతుంటాయి. మీరూ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే.. మీకోసం కొన్ని అద్భుతమైన నేచురల్ టిప్స్ తీసుకొచ్చాం. అవి ఫాలో అవ్వడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడి.. నవ యవ్వనంగా కనిపిస్తారంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆలివ్ నూనె : మెడ చుట్టూ ముడతలు తగ్గించడంలో ఆలివ్ నూనె చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా ముఖం, మెడ(Neck) భాగాలను గోరువెచ్చని వాటర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆపై చేతి మునివేళ్లతో ఆ నూనెను మెడ వద్ద అప్లై చేస్తూ స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ చుట్టూ మర్దనా చేసుకోవడం వల్ల అక్కడి చర్మకణాలకు సహజ తేమ అందుతుంది. వదులైన స్కిన్ తిరిగి టైట్గానూ మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెల్లసొన, తేనె : మెడపై ముడతలు పోగొట్టడంలో ఇది సహజసిద్ధంగా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం ముందుగా చిన్న బౌల్లో గుడ్డులోని తెల్లసొన తీసుకొని దానికి రెండు చెంచాల తేనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ దాన్ని ఫేస్, నెక్కు ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. అలా పావుగంటసేపు ఉంచి ఆపై గోరువెచ్చని వాటర్‌తో కడుక్కోవాలి. వారానికోసారి ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు.
మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా? - ఈ టిప్స్ ట్రై చేశారంటే తెల్లగా మారడం ఖాయం!
కలబంద :ఒక చిన్న బౌల్లో చెంచా చొప్పున అలోవెరా జెల్, మయోనైజ్, తేనె తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఫేస్, మెడ చుట్టూ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. అలా పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చాలా తక్కువ టైమ్‌లోనే మెడపై ఉన్న ముడతలు తగ్గి స్కిన్ కోమలంగా మారుతుందంటున్నారు నిపుణులు.