Best Tips for Get Rid of Insects and Flies: ఇళ్లు ఎంత నీట్గా ఉండాలో.. కిచెన్ అంతకంటే క్లీన్గా ఉండాలి. కాబట్టి దీని శుభ్రత విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వంట గదిలో ఉండే ఆహార పదార్థాలపై ఈగలు, బొద్దింకలు, వివిధ కీటకాలు వాలడం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది వంట గదిని తరచూ శుభ్రం చేస్తున్నా.. ఏదో ఒక చోట అవి కనిపిస్తూనే ఉంటాయి. దీంతో వీటి బెడదను వదిలించుకోవడానికి రకరకాల కెమికల్ స్ప్రేలు యూజ్ చేస్తుంటారు. కానీ, వాటిలో ఉండే రసాయనాల కారణంగా పలు రకాల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాకాకుండా ఈ నేచురల్ టిప్స్ ఫాలో అయ్యారంటే ఈగలు, కీటకాలు, పురుగులను మీ వంటగది నుంచి ఈజీగా తరిమికొట్టవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బే ఆకులు(బిర్యానీ ఆకులు): మీ కిచెన్లో ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని తరిమికొట్టడంలో బే ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. వంటగది మూలల్లో కొన్ని బిర్యానీ ఆకులను ఉంచడమే. వీటి నుంచి వచ్చే వాసనకు అవి దూరంగా వెళ్లిపోతాయి.
సిట్రస్ పీల్స్:నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష.. వంటి సిట్రస్ పండ్ల పీల్స్ కీటకాలు, ఈగలను రాకుండా చేస్తాయి. ఎందుకంటే ఆ తొక్కలు కీటకాలు అసహ్యకరమైనవిగా భావించే సహజ నూనెలను కలిగి ఉంటాయి. కాబట్టి మీ వంటగదిలో కీటకాల సమస్య ఎక్కువగా ఉంటే కిటికీలు, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద వాటిని ఉంచండి.
వెనిగర్: వైట్ వెనిగర్ వంటకాల టేస్ట్ పెంచడంలోనే కాదు కీటకాలను తరిమికొట్టడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక కీటకాలు, ఈగల బెడద నుంచి బయటపడడానికి స్ప్రే బాటిల్‌లో వాటర్, వైట్ వెనిగర్ సమాన భాగాలు తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత దానిని వంటగదిలో కొద్దిగా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవడం ద్వారా చీమలు, వివిధ కీటకాలు కిచెన్లోకి రావు. అలాగే ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల దగ్గర చిన్న బౌల్లో వెనిగర్ వేసి ఉంచడం ద్వారా వాటి బెడద ఉండదు.
దాల్చిన చెక్క :ఇది వంటకాలకు మంచి రుచిని తీసుకురావడమే కాకుండా కీటకాలను తరిమికొట్టడంలో సహజ నివారణిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది చీమలను నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. కీటకాలు, చీమల సమస్య ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లడమే. దాని నుంచి వచ్చే వాసనకు అవి చనిపోతాయి లేదా పారిపోతాయి.
మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే స్మెల్ పరార్!