Natural Tips To Get Rid Of Rats at Home: ఇంట్లోకి ఒక్క ఎలుక దూరిందా.. కొద్ది రోజుల్లోనే పెద్ద సైన్యం తయారవుతుంది. ఇక అవి చేసే అరాచకం మామూలుగా ఉండదు. ఇంట్లో అటూ ఇటూ తిరగడం మొదలు.. గుంతలు తవ్వడం, వస్తువులు పాడు చేయడం, దుస్తులు, బస్తాలు కొరికిపెట్టడం.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లో విధ్వంసం సృష్టిస్తాయి. వీటిని ఇంటి నుంచి తరిమికొట్టడానికి జనాలు ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో.. అన్నీ చేస్తారు. బోన్లు పెట్టడం, ఎర వేయడం, గమ్ స్టిక్స్ పెట్టడం, మందులు పెట్టడం.. ఇలా ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా వీలైతే అన్నీ చేస్తారు. అయినా ఫలితం మాత్రం పెద్దగా ఉండదు. అందుకే.. నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
మింట్ ఆయిల్: పుదీనా ఆయిల్ వాసన మనుషులకు రిఫ్రెషింగ్‌గా అనిపించినా.. ఎలుకలకు మాత్రం చిరాకు పుట్టిస్తుందట. కాబట్టి ఎలుకలను తరిమికొట్టేందుకు చిన్న క్లాత్‌పై కొంచెం పుదీనా నూనెను చల్లి, ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో ఉంచి.. 2 లేదా 3 రోజులకు ఒకసారి క్లాత్ మారిస్తే ఎలుకలు రాకుండా ఉంటాయని అంటున్నారు. వీటితో పాటు లవంగాలు, మిరియాలని పొడిగా చేసి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో చల్లినా ఆ ఘాటు వాసనకి ఎలుకలు పోతాయంటున్నారు.
2012లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఇంటి నుంచి ఎలుకలను తరిమి వేయడంలో పుదీనా నూనె ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఈజిప్ట్‌లోని కైరోలోని Ain Shams విశ్వవిద్యాలయంలో పురుగుల నియంత్రణ, వ్యవసాయ జీవశాస్త్రంలో ప్రొఫెసర్ డాక్టర్ M.S. Abdel-Rahman పాల్గొన్నారు.
కారు ఇంజిన్‌లో ఎలుకలు దూరి అంతా పాడు చేస్తున్నాయా? - ఈ టిప్స్‌తో అవి పరార్!
బేకింగ్ సోడా:వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడా ఎలుకలను తరిమికొట్టగలదని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ముందుగా ఓ కప్పు మైదా తీసుకొని.. అందులో పిప్పర్‌మెంట్ ఆయిల్, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసి ఇంట్లో ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచితే..ఫలితం ఉంటుందంటున్నారు.