Natural Oils For Hair Growth : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల.. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం, చివర్లుచిట్లి పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి హెయిర్ డ్యామేజ్ మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తోంది. అయితే.. రోజూ కొన్ని రకాల సహజ నూనెలను జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొంద వచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఏ సమస్యకు ఎలాంటి ఆయిల్ వాడాలనేది ఇప్పుడు చూద్దాం.
ఆముదం నూనె :
ఆముదం నూనెలో విటమిన్ ఇ, ప్రొటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనన్ని రోజూ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెయిర్ పెరుగుదలలోనూ ఆముదం నూనె ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. 2015లో ప్రచురించిన 'కాస్మెటిక్ డెర్మటాలజీ జర్నల్' నివేదిక ప్రకారం.. ఆముదం నూనెను వారానికి రెండు సార్లు అప్లై చేసుకున్న వారిలో జుట్టు మృదువుగా, మెరిసేలా మారిందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 40 మంది పాల్గొన్నారు. ఇది 8 వారాల పాటు జరిగింది.
టీట్రీ ఆయిల్ :
పొడి జుట్టు, చుండ్రు సమస్యతో బాధపడేవారికి టీ ట్రీ ఆయిల్ బాగా పని చేస్తుందట. ఆ నూనె అప్లై చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయట. అలాగే.. ఒత్తైన జుట్టు సొంతమవుతుందని చెబుతున్నారు.
ఉల్లిపాయ నూనె :
ఉల్లిపాయ నూనె కూడా జుట్టుకు సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుతుంది. అదేవిదంగా.. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!