Salt Water Vastu Tips:ఉప్పు వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాకుండా.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి, పాజిటివ్ శక్తిని పెంచుతుందట. కుటుంబ సమస్యలు, గృహ ఇబ్బందులు దూరం చేసి, కుటుంబంలో ఆనందాన్ని నింపడానికి ఉప్పు(Salt)ఎంతగానే ఉపయోగపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి.. ఉప్పుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు చూద్దాం.
ఉప్పు నీటితో ఇంటి క్లీనింగ్ : అందరూ తరచూ ఇంటి ఫ్లోర్‌ను నీటితో శుభ్రం చేస్తుంటారు. అయితే.. ఆ నీటిలో ఉప్పు వేసి క్లీన్ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయట. ఉప్పునీటితో ఇంటిని క్లీన్ చేయడానికి ఉదయం ఉత్తమ సమయమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నీటితో ఇంటిని తుడవ వద్దనీ.. సాయంత్రం వేళలోనూ ఉప్పునీటికో క్లీన్ చేయడం అంత మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
ఆ రోజున వద్దు: మీరు గురువారం ఇంటిని తుడుచుకోవడం, శుభ్రపరచడం వంటివి చేయకూడదట. ముఖ్యంగా ఉప్పునీటిని ఉపయోగించి ఇంటిని అస్సలు క్లీన్ చేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే.. గురువారం విష్ణువు, బృహస్పతి రోజును సూచిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంటిని తుడుచుకోవడం మానుకోవడం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు.
ఆనందాన్ని నింపుతుంది : ఉప్పునీటిని ఉపయోగించి నేలను తుడుచుకోవడం ద్వారా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ ప్రక్రియ ఇంట్లో శాంతిని నెలకొల్పడంతో పాటు వివిధ సమస్యల నుంచి బయటపడటానికీ చాలా బాగా సహాయపడుతుందట. ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి.. ఉప్పుతో చేసే వాస్తుదోష నివారణ పద్ధతులను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో సమస్యలు తొలగిపోయి ఆనందం నిండుతుందని చెబుతున్నారు.