తెలంగాణ

telangana

ETV Bharat / health

రోజూ పుదీనా తింటున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులివే! - పుదీనా లాభాలు

​Mint Health Benefits: పుదీనా ఆకులను రోజువారీ వంటల్లోనే కాకుండా.. ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అయితే.. పుదీనా రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

​Mint Health Benefits
​Mint Health Benefits

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 11:01 AM IST

​Mint Health Benefits and Side Effects: పుదీనా ఆకులు.. వీటి వాసన చూస్తేనే చాలు ఎంత చిరాకులో ఉన్నా సరే, రీఫ్రెష్‌ ఫీలింగ్‌ వస్తుంది. వంటల్లోనూ మంచి రుచి, సువాసన కోసం పుదీనా వాడుతుంటారు. అయితే.. పుదీనా కేవలం వంటల టేస్ట్‌ పెంచడానికే కాదు, మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మరి పుదీనా రోజూ తింటే ఏం జరుగుతుంది..? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

పోషకాలు..:పుదీనాలో మన ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు చాలానే ఉన్నాయి. విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేసి.. దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్‌ సి.. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇంకా ఐరన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి.

రోజు పుదీనా తింటే కలిగే లాభాలు:

  • జీర్ణక్రియకు మేలు:పుదీనాలోని ఔషధ గుణాలు.. జీర్ణ సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) ఉన్న వ్యక్తులు పుదీనాను డైట్‌లో చేర్చుకుంటే.. ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు దూరం అవుతాయి. కడపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది.
  • తాజా శ్వాస:నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి పుదీనా సాయపడుతుంది. తద్వారా శ్వాస తాజాగా ఉంటుంది. అంతే కాకుండా పుదీనా ఆకులు నమిలితే.. నోరు రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా.. చిగుళ్లు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • అలెర్జీలు:పుదీనాలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పుదీనా అలర్జీలు, ఆస్తమా వంటి.. శ్వాసకోశ ఇబ్బందులకు చెక్‌ పెట్టడానికి సహాయపడతాయి. పుదీనా ఆకుల వాసన చూసినా, పుదీనా టీ తాగినా.. అలర్జీ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • చర్మానికి రక్షణగా:పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు.. చర్మాన్ని సంరక్షిస్తాయి. పుదీనాలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ప్రీరాడికల్స్‌ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. పుదీనా చర్మానికి తాజాదనం అందించడంతోపాటు రియాక్టివేట్‌ చేస్తుంది. అలాగే అభిజ్ఞా పనితీరును పెంచడంలో కూడా సాయపడుతుంది.

రోజు పుదీనా తింటే కలిగే నష్టాలు:రోజు పుదీనా తీసుకుంటే లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

  • పుదీనా ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట, నోరు ఎండిపోవడం, వికారం, వాంతులు వంటి సమస్యలకి దారి తీయవచ్చు.
  • గ్యాస్ట్రో ఎసోఫగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) తో బాధపడేవారు పుదీనాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది రోగ లక్షణాలను మరింత పెంచుతుంది.
  • నవజాత శిశువుల ముఖంపై పుదీనా నూనెను ఉపయోగించడాన్ని మానుకోవడం మంచిది.
  • చిన్నారుల్లో ఒళ్లు నొప్పులు కలగడమే కాకుండా.. శ్వాసలో ఇబ్బంది కూడా తలెత్తవచ్చు.

గమనిక: పుదీనా లాభాలు, నష్టాలు మనిషిని బట్టి మారొచ్చు. కాబట్టి.. మీ ఆహారంలో పుదీనాను చేర్చుకోవడంపై సలహా కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మీ బ్రెయిన్​కు​ రెస్ట్​ ఇస్తున్నారా - సైన్స్​ చెబుతున్న ఆశ్చర్యకర విషయాలు!

అర్ధరాత్రి దాకా నిద్రపోవట్లేదా?

తాగేద్దాం.. చల్లచల్లగా.. పుదీనా రసం!

ABOUT THE AUTHOR

...view details