Health Effects of Mayonnaise : మయొనైజ్.. ప్రస్తుత రోజుల్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఏ రెస్టారెంట్‌కి వెళ్లి కరకరలాడే ఆహార పదార్థాలను ఆర్డర్ చేసినా మయొనైజ్ తప్పక ఉంటుంది. సాధారణంగా దీన్ని పాశ్చరైజ్డ్ గుడ్లతో మాత్రమే చేస్తారు. కానీ, దీన్ని ఏ మాత్రం నిల్వ ఉంచినా, అపరిశుభ్రంగా తయారు చేసినా ఇందులోని బ్యాక్టీరియా ప్రాణాంతకం అవ్వొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే అనేక తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. మితిమీరి తిన్నా కూడా ప్రమాదమే అంటున్నారు. మరి ఆ సమస్యలేంటో తెలుసుకుని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలే కదా.! అందుకోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
మయొనైజ్ తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు :
బరువు పెరుగడం: చాలా మందికి మయొనైజ్ టేస్ట్ నచ్చుతుందని కానీ దానిని ఎలా తయారు చేస్తారు అనే వివరాలు మాత్రం తెలియవు. దీనిని కోడిగుడ్లు, నూనె, ఎక్కువ ఉప్పు కలిపి తయారు చేస్తారు. కాబట్టి ఇందులో కొవ్వులు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తరచూగా మయొనైజ్‌ను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అలర్ట్ : మౌత్‌వాష్ వాడటం మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారు?? - Mouthwash Benefits And Risks
గుండె జబ్బుల ప్రమాదం :మయొనైజ్‌ను వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేస్తారు. దీనివల్ల ఇందులో శాచురేటెడ్, ట్రాన్స్‌ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే, మయొనైజ్‌ను అధికంగా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మయొనైజ్ ఎక్కువగా తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'హార్వర్డ్ మెడికల్ స్కూల్'కు చెందిన 'డాక్టర్. డారియుష్ మొజాఫ్ఫారియన్' (Dr. Dariush Mozaffarian) పాల్గొన్నారు. మయొనైజ్ ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కెమికల్స్ ఉంటాయి :మార్కెట్లో దొరికే మయొనైజ్ ప్యాకెట్‌లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి అందులో కెమికల్స్ వాడుతుంటారు. అందుకే వీటిని తరచూ తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలలో ఈ సమస్య కనిపిస్తుందని నిపుణులంటున్నారు.