తెలంగాణ

telangana

ETV Bharat / health

మానిక్యూర్ కోసం బ్యూటిపార్లర్​కు వెళ్తున్నారా? - అయితే ఇకపై ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! - Best Tips for Smooth Hands

Manicure at Home : నేటి తరం యువత అందంగా కనిపించడం కోసం ముఖంతో పాటు పాదాలు, చేతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరచుగా పెడిక్యూర్, మానిక్యూర్​ కోసం బ్యూటిపార్లర్​కు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయితే ఇకపై అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా మానిక్యూర్ చేసుకోవచ్చు? అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Manicure at Home
Manicure

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 12:33 PM IST

Manicure for Beautiful Hands at Home :అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ముఖంతో పాటు పాదాలు, చేతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలు ఈ విషయంలో కాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చేతులు, గోర్లు అందంగా కనిపించడానికి వేలకు వేలు ఖర్చు చేస్తూ తరచూ బ్యూటిప్లారర్​లో మానిక్యూర్ చేయించుకుంటున్నారు. అయితే ఇకపై ఆ అవసరం లేదని.. పైసా ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే ఈజీగా మానిక్యూర్ చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మానిక్యూర్ అంటే ఏమిటంటే.. మానిక్యూర్ అనేది ఒక లాటిన్ పదం. లాటిన్​ భాషలో మానస్ అంటే చేయి, క్యూర్ అంటే జాగ్రత్త అని అర్థం. మొత్తంగా మానిక్యూర్ అంటే.. చేతులు, చేతివేళ్లు, గోళ్ల(Nails)ను అందంగా తీర్చిదిద్దే ప్రక్రియ. అలాగే మానిక్యూర్ చేయించుకోవడం వల్ల చేతులు మృదువుగా, కోమలంగా, అందంగా తయారవుతాయి. ఇక ఈ మానిక్యూర్​ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీరు మీ చేతి గోళ్లకు ఏదైనా నెయిల్ పాలిష్​ ఉంటే.. నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించి దానిని పూర్తిగా క్లీన్​ చేసుకోవాలి. అయితే మొండి లేదా మెరిసే నెయిల్​ పెయింట్లను రిమూవ్​ చేయడం కోసం అసిటోన్ ఆధారిత రిమూవర్‌, సాధారణ పెయింట్స్​ కోసం నాన్-అసిటోన్ రిమూవర్‌లను ఎంచుకోవాలి. ఆ రిమూవర్​లో కాటన్ బాల్స్ ముంచి ప్రతి గోరుపై ఉన్న నెయిల్ పెయింట్​ను​ పూర్తిగా పోయేలా సున్నితంగా స్క్రబ్ చేయాలి.
  • నెయిల్​ పాలిష్​ను రిమూవ్​ చేసిన తర్వాత గోళ్ల‌ను మీకు న‌చ్చిన‌ షేప్​లో క‌ట్ చేసుకొవాలి. ఆ తర్వాత అంచులను సున్నితంగా ఫైల్ చేసి ట్రిమ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో సోప్​ లిక్విడ్​ కలుపుకోవాలి. ఇప్పుడా వాటర్​లో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ వాటర్​లో రెండు చేతుల వేళ్లు మునిగేలా 5 నుంచి 10 నిమిషాలు ఉంచాలి.
  • ఇలా చేయడం వల్ల గోళ్ల‌కు ప‌ట్టి ఉన్న మురికి, మ‌లినాలు తొల‌గి పోతాయి. అలాగే గరుకుగా ఉంటే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. అదేవిధంగా నెయిల్ చుట్టూ ఉండే స్కిన్ కూడా మెత్తగా మారుతుంది. ఆ తర్వాత గోళ్ల చుట్టూ ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే క్యూటికల్ రిమూవర్​తో తొలగించుకోవాలి. ఈ విధంగా చేయడం గోళ్లు అందంగా, పెద్ద‌గా కనిపిస్తాయి.
  • అనంతరం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ షుగర్ పౌడర్, బియ్యం పిండి, రెండు స్పూన్ల కాఫీ పౌడర్, ఐదు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుని కలుపుకోవాలి.
  • ఇక మిశ్రమాన్ని అరచేతుల నుంచి మోచేతుల వరకు అప్లై చేసి సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. అయితే ఇది అప్లై చేయడానికి ముందు చేతులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
  • అలా స్క్రబ్ చేసుకున్నాక చేతులను చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కొని మృదువైన టవల్​తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆపై మంచి మాయిశ్చరైజర్ తీసుకొని చేతులు, చేతివేళ్లకు అప్లై చేసి స్మూత్​గా మసాజ్ చేసుకోవాలి. అయితే గోళ్లకు మాయిశ్చరైజర్​ అప్లై చేయవద్దు.
  • ఇలా చేసిన అనంతరం చివరగా నెయిల్స్​కు​ మంచి నెయిల్ పాలిష్ వేసుకోవాలి. అంతే బ్యూటిపార్లర్​కు వెళ్లకుండానే ఇంట్లోనే ఈజీగా మానిక్యూర్ పూర్తి అవుతుంది.
  • ఈ విధంగా ఇంట్లోనే రెండు వారాల‌కు ఒకసారి మానిక్యూర్ చేసుకుంటే మీ చేతులు మృదువుగా, కోమ‌లంగా, అందంగా మెరిసిపోతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details