తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ​ టీ తాగారంటే - నిద్రలేమి నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ పరార్​! - lemon balm tea benefits

Lemon Balm Tea Benefits: చాలా మంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే టీ/కాఫీ అధికంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి ప్లేస్​లో ఈ హెర్బల్​ టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

Lemon Balm Tea
Lemon Balm Tea Benefits (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 24, 2024, 12:59 PM IST

Lemon Balm Tea Benefits:మనలో చాలా మంది ఉదయాన్నే ఎంతో ఇష్టంగా టీ, కాఫీ సేవిస్తుంటారు. నలుగురు ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇంట్లోకి అతిథులు వచ్చినా కూడా టీ, కాఫీలను అందిస్తుంటారు. అయితే, ఇందులోని కెఫెన్​ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది టీ, కాఫీలకు చెక్ పెట్టి ఆరోగ్యవంతమైన పానీయాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం చాలా రకాల హెర్బల్​ టీ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లెమన్​ టీ, పుదీనా టీ, అల్లం టీ, సోంపు టీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్​లోకి మరో టీ వచ్చి చేరింది. అదే లెమన్​ బామ్​ టీ. పుదీనా జాతికి చెందిన ఈ మొక్కతో చేసే టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది:లెమన్​ బామ్​లో ఒత్తిడి, ఆందోళనను తగ్గించే అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతతను చేకూర్చేలా లెమన్​ బామ్​ టీ సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. 2004లో జర్నల్​ ఆఫ్​ ఫార్మసీ అండ్​ ఫార్మకాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం లెమన్​ బామ్​ టీ తాగేవారిలో ఒత్తిడి, ఆందోళన(National Institute of Health రిపోర్ట్​) తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో UK లోని Northumbria యూనివర్సిటీలో హ్యూమన్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్​లో ప్రొఫెసర్​ డాక్టర్​ డేవిడ్ ఓవెన్ కెన్నెడీ(David Owen Kennedy) పాల్గొన్నారు. లెమన్​ బామ్​లోని రోస్మరినిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సుఖ నిద్రను ఇస్తుంది:కెఫెన్​ లాగా నిద్రకు భంగం కలిగించకుండా హాయిగా నిద్రపోయేందుకు లెమన్ బామ్ టీ ఉపయోగపడుతుందని తెలిపారు. నిద్రలేమి సంబంధిత వ్యాధులకు సహజ ఔషధంగా దీనిని వినియోగిస్తారని చెబుతున్నారు. లెమన్​ బామ్ టీని తీసుకోవడం వల్ల నిద్రలేమి తగ్గి.. సుఖంగా నిద్రపోయినట్లు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్​ అండ్​ మెటబాలిజంలో తేలిందని వివరించారు.

మెదడు ఆరోగ్యం మెరుగు:లెమన్ బామ్ టీ కేవలం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుందని తెలుపుతున్నారు. సైకోస్మోటిక్​ మెడిసిన్​ అధ్యయనం ప్రకారం లెమన్​ బామ్ టీ.. జ్ఞాపకశక్తిని పెంచుతుందని.. వివరిస్తున్నారు. కెఫెన్​ లేకుండా మెదడు చురుకుగా పనిచేసేందుకు లెమన్ బామ్​ టీ చక్కటి ఔషధమని సూచిస్తున్నారు.

అజీర్తి, గ్యాస్​లకు చెక్​:జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు లెమన్ బామ్ టీ చక్కటి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఉబ్బరం, అజీర్తి, గ్యాస్​ లాంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తుందని తెలిపారు.

దీర్ఘకాలిక వ్యాధులు రావట​:లెమన్ బామ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లేమటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని.. ఇవి అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతాయంటున్నారు.

మెరుగైన గుండె ఆరోగ్యం:తరచుగా లెమన్ బామ్​ టీని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటును తగ్గించి.. రక్త ప్రసరణను పెంచుతుందని.. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుందని వివరిస్తున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ బ్రెయిన్​ జెట్​ స్పీడ్​లో దూసుకెళ్లాలా? - ఈ ఆహారాన్ని డైట్​లో చేర్చుకోండి! - improve brain power food

స్మోకింగ్​, డ్రింకింగ్​ కాదు - కాలేయాన్ని ఎక్కువ దెబ్బతీసే ఆహారాలు ఇవే! మీకు తెలుసా? - Foods to Avoid Keep Liver Healthy

ABOUT THE AUTHOR

...view details