తెలంగాణ

telangana

రాత్రిపూట మీ కాళ్లు, చేతుల్లో ఇలా అనిపిస్తోందా? - మిమ్మల్ని ఆ సమస్య వేధిస్తున్నట్టే! - Leg Cramps At Night

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 5:28 PM IST

Leg Cramps At Night : కొంతమందికి కూర్చొనే భంగిమతో కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. అలాగే.. డయాబెటిస్ ఉన్నవారికి అప్పుడప్పుడు తిమ్మిర్లు రావడం సహజమే. అలాకాకుండా.. మిమ్మల్ని రాత్రిపూట కాళ్లు, చేతులలో తిమ్మిర్లు వేధిస్తున్నాయా? అయితే, మీరు ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించాలంటున్నారు నిపుణులు. మరి, ఆ సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.

Symptoms Of Vitamin B12 Deficiency
Leg Cramps At Night (ETV Bharat)

Symptoms Of Vitamin B12 Deficiency : సాధారణంగా ఎవరికైనా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నా, పడుకున్నా.. కాళ్లు, చేతులలో తిమ్మిర్లు వస్తుంటాయి. ఎందుకంటే.. ఒకే పొజిషన్​లో ఎక్కువసేపు ఉండడం వల్ల కండరాలు ఒత్తిడికి గురవడం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల తిమ్మిర్లు వస్తాయి. అలాగే మధుమేహులకు అప్పుడప్పుడు కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం కామన్. కానీ, అలాకాకుండా దేనికి సంబంధం లేకుండానే తిమ్మిర్లు వస్తే మాత్రం అనుమానించాల్సిందే. అందులోనూ రాత్రిపూట కాళ్లు, చేతులలో తిమ్మిర్లు వస్తే మాత్రం వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. అలాగే.. మిమ్మల్ని 'ఈ ఆరోగ్య సమస్య' వేధిస్తున్నట్లు గుర్తించాలని సూచిస్తున్నారు. ఇంతకీ, ఏంటి ఆ సమస్య? దాని నుంచి ఎలా బయటపడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కాళ్లు, చేతులలో తిమ్మిర్లు రాత్రిపూట మాత్రమే కాదు.. కొంతమందికి కూర్చున్న సమయంలో, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వస్తుంటాయి. అయితే, అసలు ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం..విటమిన్ బి12(Vitamin B12) లోపించడమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. దీనికి త్వరగా గుర్తించి తగిన ట్రీట్​మెంట్ తీసుకోకపోతే తీవ్రత క్రమంగా పెరిగి కాళ్ల నొప్పులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి, మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు. అంతేకాకుండా.. "విటమిన్ బి12 పరీక్ష" చేయించుకోవాలని సూచిస్తున్నారు.

2013లో "న్యూరాలజీ" జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. విటమిన్ బి12 లోపం ఉన్న వ్యక్తులలో అరికాళ్లలో మంట, కాళ్లు, చేతులలో తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్​లో నార్వేలోని ఓస్లో యూనివర్సిటీకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోనికా క్రాస్ పాల్గొన్నారు. శరీరంలో బి12 లోపించడం వల్ల అరికాళ్లలో మంట, చేతులు, కాళ్లు, తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అప్పుడే ప్రేమగా - ఆ వెంటనే కోపంగా - సైలెంట్​గా సారీ కూడా చెప్తారు - ఈ మెంటాలిటికీ ఆన్సర్​ దొరికింది!

విటిమిన్ బి12 లోపం ఉంటే రాత్రిపూట కాళ్లు, చేతులలో తిమ్మిర్లు రావడమే కాకుండా మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..

  • అలసట, బలహీనత
  • నోటి పూత, ఆకలి తగ్గడం
  • రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం
  • మైకం కమ్మినట్లు అనిపించడం
  • కళ్లు, శరీరం కొంచెం పసుపు రంగులోకి మారతాయి
  • రక్తహీనత
  • ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం
  • డిప్రెషన్
  • మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి
  • కామెర్లు వంటి మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.

ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే?

సాధారణంగా విటమిన్ బి12 నాన్​వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు మాంసాహారులైతే మటన్, చికెన్, గుడ్లు, సీ ఫుడ్, చేపలు వంటివి తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ లోపం బారిన కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అదే మీరు శాఖాహారులయితే.. పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, బీట్​రూట్, పాలకూర వంటివి రోజువారి డైట్​లో చేర్చుకోవడం ద్వారా ఈ లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు విటమిన్ బి12 లోపం ఉందా? - ఇలా చేస్తే ఇట్టే భర్తీ అయిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details