Keeping Bed Clean Health Benefits :ఈరోజుల్లో చాలా మంది అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు మాత్రం చాలా యాక్టీవ్‌గా రోజూవారి పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. దీనికి పడకగది(Bedroom)శుభ్రంగా ఉంచుకోవడం కూడా బలమైన కారణమని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెరుగైన నిద్ర : ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోమని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ, ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు పడకగదిలో బెడ్‌ను నీట్‌గా రెడీ చేసుకుంటే చక్కటి నిద్ర పడుతుందని చెబుతున్నారు. మరింత రిలాక్సేషన్ లభిస్తుందని సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది : ఒత్తిడి అనేది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి బెడ్ రూమ్‌ను ఉపయోగించుకోవచ్చట. రోజూ మీ పడకగదిని శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు.. మీ బెడ్‌ను మీరే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. లేవగానే బెడ్ షీట్లు నీట్‌గా సర్దకునే అలవాటు ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
మంచి మనస్తత్వం : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నిద్రలేవగానే పని హాడావుడిలో బెడ్రూమ్లో ఎక్కడి దుప్పట్లు అక్కడే గజిబిజిగా పడేస్తారు. కానీ, అది మీ రోజువారి పనులపై చాలా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అందువల్ల.. ఎవరి బెడ్‌ను వారు పడుకునే ముందు రెడీ చేసుకోవడంతోపాటు నిద్రలేచాక సర్దుకుంటే మీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుందట. అలాగే మంచి మనస్తత్వం మీలో అలవడే అవకాశం ఉంటుందంటున్నారు.