తెలంగాణ

telangana

ETV Bharat / health

నిజంగా చక్కెరకన్నా బెల్లం మంచిదా? - Jaggery Health Benefits

Jaggery Health Benefits : తీపి పదార్థాలు ఏవి తయారు చేయాలన్నా.. అందరూ ఉపయోగించేది చక్కెరనే. కానీ.. చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించాలని, అదే ఆరోగ్యమని నిపుణులు చెబుతుంటారు. మరి.. నిజంగా చక్కెరకు బదులుగా బెల్లం మంచిదా??

Jaggery Health Benefits
Jaggery Health Benefits

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 5:23 PM IST

Jaggery Health Benefits :తీపి వంటకాలు ఏవైనా.. చక్కెరతో చేసినవే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. బెల్లం, పంచదార రెండూ తీపిగానే ఉంటాయి కదా.. ఏది వాడితే ఏముందేలే అని అనుకుంటూ ఉంటారు. కానీ.. హెల్త్‌ బెన్‌ఫిట్స్‌ పరంగా చూస్తే చక్కెరతో నష్టం ఎక్కువగా ఉంటుందని.. బెల్లంలోతో ఎక్కువ లాభాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి.. బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటీ? బెల్లంలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

బెల్లంలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ.. చక్కెరలో ఈ పోషకాలు ఉండవు. దీనికి కారణం ప్రాసెసింగ్‌ చేయడమే. కానీ.. చక్కెరలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే.. బెల్లం వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :బెల్లంలో ఉండే ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు జీర్ణక్రియసాఫీగా సాగేలా చేస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులంటున్నారు.

మీరు తింటున్న బెల్లం మంచిదేనా? - కల్తీని ఇలా చెక్​ చేయండి!

రక్తహీనత తగ్గిస్తుంది :బెల్లం తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనం ఏమంటే.. రక్తహీనత తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, ఫాస్ఫరస్ మూలకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్య ఎదురుకాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. బాడీలో రక్తం పెరగడానికి తోడ్పడుతుంది. బెల్లానికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. గర్భిణులు బెల్లం తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చట. 2015లో ప్రచురించిన 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌' నివేదిక ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు 100 గ్రాముల బెల్లం తిన్న గర్భిణులలో హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారట. రోజూ బెల్లం తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుందట.

చక్కెర కంటే బెల్లం ఎందుకు బెస్ట్‌ అంటే ?
వైట్‌ షుగర్‌లో 99.7 శాతం సుక్రోజ్ ఉంటుంది. అదే బెల్లంలో కేవలం 70 శాతం మాత్రమే సుక్రోజ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రొటీన్స్‌, ఫ్యాట్‌, విటమిన్లు ఉండే బెల్లాన్ని వాడాలని సూచిస్తున్నారు.

పంచదారకు బదులు పూర్తిగా బెల్లం వాడొచ్చా? ఆరోగ్యానికి మంచిదా కాదా?

100 గ్రాముల బెల్లంలో ఉండే పోషకాలు :

పోషకాలు గ్రాముల్లో
క్యాలరీలు 383 గ్రా
ప్రొటీన్ 0.4 గ్రా
ఫ్యాట్‌ 0.1 గ్రా
సుక్రోజ్ 65-85 గ్రా
ఫ్రక్టోజ్, గ్లూకోజ్ 10-15 గ్రాములు
ఇనుము 11 మి.గ్రా
మెగ్నీషియం 70-90 మి.గ్రా
పొటాషియం 1050 మి.గ్రా
మాంగనీస్ 0.2-0.5 మి.గ్రా
భాస్వరం 20-90 మి.గ్రా
విటమిన్ A 3.8 మి.గ్రా
విటమిన్ సి 7.0 మి.గ్రా
విటమిన్ E 111.30 మి.గ్రా

పిల్లల్లో ఫ్యాటీ లివర్‌ సమస్య - తల్లిదండ్రులు మేల్కోకుంటే ఇబ్బందే!

రెడ్​ కలర్​ అరటి పండు - సంతానోత్పత్తి కెపాసిటీ నుంచి కంటి చూపుదాకా ఎన్నో బెనిఫిట్స్!

ABOUT THE AUTHOR

...view details