What Happens to Your Body Daily Eat Boiled Eggs :శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని చాలా మంది డైలీ ఒకటి నుంచి రెండు ఉడకబెట్టిన గుడ్లను(Eggs) తింటుంటారు. మీరూ అలాగే తింటున్నారా? అయితే, అలా రోజూ బాయిల్డ్ ఎగ్స్ తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? లేదు.. అంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.
నిజానికి రోజూ కనీసం ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..
పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి :విటమిన్లు A, D, E, B12, ఫోలేట్, ఐరన్, భాస్వరం, సెలీనియంతో శరీరానికి అవసరమైన మరికొన్ని పోషకాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి.. డైలీ ఉడికించిన గుడ్డు తీసుకోవడం ద్వారా లభించే ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు.
కండరాలు బలంగా తయారవుతాయి : ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలలో గుడ్డు ఒకటి. కాబట్టి డైలీ ఉడికించిన గుడ్డును తీసుకోవడం ద్వారా లభించే ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు వంటివి కండరాలు బలంగా తయారవ్వడానికి చాలా బాగా తోడ్పడతాయంటున్నారు. అంతేకాదు.. దెబ్బతిన్న కణజాలాలను బాగు చేయడంలో ఇవి సహాయపడతాయని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం మెరుగు : గుడ్డులో కొలెస్ట్రాల్(Cholesterol) కంటెంట్ ఉన్నప్పటికీ.. మితంగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా దోహదపడుతుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ శుభాంగి తమ్మళ్వార్. ముఖ్యంగా ఎగ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు.
షుగర్ బాధితులు - రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?
మెదడు పనితీరు మెరుగుపడుతుంది : గుడ్లలో కోలిన్(National Library of Medicine రిపోర్టు)పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి, అభిజ్ఞా పనితీరుకు అవసరమైన పోషకం. కాబట్టి.. డైలీ ఒకటి లేదా రెండు ఉడికించిన ఎగ్స్ తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు మొత్తం మెదడు పనితీరు మెరుగుపడుతుందంటున్నారు డాక్టర్ శుభాంగి.