ETV Bharat / health

వారానికి కనీసం 150 నిమిషాలు వర్కౌట్ చేయకపోతే - 40 దాటకుండానే "నారాయణ జపం" తప్పదట! - 150 MINUTES EXERCISE

- భారత్​లో మెజారిటీ యువత వ్యాయామం చేయట్లేదంటున్న "లాన్సెట్" - తీవ్ర దుష్పరిణామాలు తప్పవంటున్న నిపుణులు

exercise for 150 Minute
exercise for 150 Minute (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 2:34 PM IST

exercise for 150 Minutes : మెజారిటీ జనం వ్యాయామం గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆఫీసులో గంటలతరబడి కూర్చోవడం, ఇంటికి వచ్చిన తర్వాత టీవీ, కంప్యూటర్ ముందు కూలబడడం! ఇదే దినచర్యగా మారింది. కనీసం అరగంట వ్యాయామం చేయడానికి కూడా తీరిక, ఓపిక ఉడట్లేదు. అయితే, దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. వారానికి కనీసం 150 నిమిషాలపాటు కూడా Exercise చేయని వారికి రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేశంలో ఇప్పుడు యూత్​గా ఉన్నవారిలో సగంమందికి పైగా శారీరక శ్రమ గురించి అస్సలు పట్టించుకోవట్లేదని "లాన్సెట్" అధ్యయనం వెల్లడించింది. WHO సిఫారసుకు తగిన విధంగా వీళ్లు కనీస వ్యాయామం కూడా చేయట్లేదని నివేదిక కుండ బద్ధలు కొట్టింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, యువకులు ఏరోబిక్ మీడియం స్థాయి వ్యాయామాల కోసం వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు చేయాల్సి ఉంటుంది. హార్డ్​ వ్యాయామాలైతే కనీసం 75 నుంచి 150 నిమిషాలపాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం మెజారిటీ యువకులు వ్యాయామం చేయడం పూర్తిగా మానేస్తున్నారని లాన్సెట్​ పేర్కొంది.

మోకాలి నొప్పులు :

ఇటీవల చాలా మంది యువకులు 30 ఏళ్లు కూడా దాటకుండానే మోకాళ్ల నొప్పుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వ్యాయామం చేసే వాళ్లకు మాత్రం ఈ సమస్యలు రావట్లేదని నిపుణులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల మజిల్స్, బోన్స్ దృఢంగా తయారవుతాయని చెబుతున్నారు. మహిళల విషయానికి వస్తే మెనోపాజ్ దాటిన తర్వాత ఎముకలు పెళుసుబారుతాయని, వ్యాయామం చేయని వారిలో ఈ పరిస్థితి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ఫ్రాక్చర్లకు ఎక్కువగా అవకాశం ఉంటుందని అంటున్నారు. యోగా లేదంటే శారీరక శ్రమ కలిగించే ఆటలవైపు దృష్టి పెట్టడం వల్ల ఈ సమస్యను అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. వారంలో రెండు రోజులకంటే ఎక్కువ సార్లు ఎక్సర్​సైజ్​ చేస్తే ప్రయోజనాలు మరింతగా ఉంటాయట.

శారీరక శ్రమకు, వ్యాయామాలకు దూరంగా ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా వచ్చేస్తాయని whoకు చెందిన హెల్త్‌ ప్రమోషన్ డైరెక్టర్ రుడిగర్ క్రెచ్‌ హెచ్చరిస్తున్నారు. షుగర్, హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో సుమారు 10 కోట్లమందికి పైగా జనం షుగర్​తో బాధపడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య రాబోయే కాలంలో మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అందువల్ల ఇకనైనా మేల్కోవాలని సూచిస్తున్నారు. అసలు ఏ వ్యాయమమూ చేయకుండా ఉండే బదులు, కొద్దికొద్దిగానైనా మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. కంటిన్యూగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఈ వ్యాయామాలు శారీరకంగానే కాకుండా మెంటల్​గా కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని సూచిస్తున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్‌ వంటి సమస్యలు రాకుండా బ్రెయిన్‌ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. సో, తప్పకుండా వ్యాయమం మొదలు పెట్టండి ఇవాళ్టి నుంచే. లేకపోతే తాతలు, నానమ్మలు కూర్చోవడానికి, లేచి నిలబడడానికి 80 ఏళ్ల వయసులో చేసే "నారాయణ నారాయణ" జపం, మీరు 40లోనే చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

రోజూ ఉదయాన్నే నడవడం వల్ల కీళ్లు అరిగిపోతాయా? - ఇందులో నిజం ఎంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.