Is Diabetic Patients Can Eat Tamarind:ప్రస్తుత రోజుల్లో చాప కింద నీరులా విస్తరిస్తోన్న వ్యాధి డయాబెటిస్. వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా చాలా మంది షుగర్‌తో బాధపడుతున్నారు. ఇక ఒక్కసారి షుగర్ ఇది ఎటాక్ అయితే జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటూ, మందులు వాడుకోవడం తప్ప మరో ఛాన్స్ లేదు. అందుకే ముందునుంచి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మధుమేహ బాధితులు చింతపండు తినొచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది. చింతపండు తింటే షుగర్ పెరుగుతుందని కొద్దిమంది అంటే, షుగర్ కంట్రోల్లో ఉంటుందని మరికొద్దిమంది వాదిస్తుంటారు. మరి ఇందులో నిజమేంత? చింతపండు తినొచ్చా? లేదా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చింతపండు తినొచ్చా?: ఇతర పండ్ల మాదిరే చింతపండుతో కూడా మనకు చాలా లాభాలే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-బి, విటమిన్-సిలు సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితుల విషయానికి వస్తే చింతపండు తినడం మంచిదని చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయని అంటున్నారు.
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులలో ప్యాంక్రియాటిక్ కణజాలం నష్టాన్ని చింతపండు తిప్పికొడుతుందని చెబుతున్నారు. అలాగే ఇందులోని ఫైబర్, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్(HCA) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని, ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. చింతపండు ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు. 2018లో జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చింతపండు సారం టైప్ 2 డయాబెటిస్ రోగులలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుందని కనుగొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). అయితే మంచిదికదా అని చింతపండును మోతాదుకు మించి తీసుకుంటే పలు సమస్యలు వచ్చే అవకాశమని హెచ్చరిస్తున్నారు.