Anemia Symptoms :కొద్దిసేపు పని చేయగానే నీరసం ముంచుకొస్తుంది. కాసేపు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది. ఏకాగ్రత కుదరదు. పని మీద శ్రద్ధా ఉండదు. ప్రతిదానికి చిరాకు, కోపం.. వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. సరిగా తినకపోవటం వల్ల వచ్చిన బలహీనతగానో.. రాత్రి నిద్ర పట్టకపోవటం వల్ల తలెత్తిన అలసటగానో భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ లక్షణాల వెనుక ఓ లోపం ఉందని ఆరోగ్య నిపుణులంటున్నారు. మరి ఆ ప్రాబ్లమ్ ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..
తీవ్రమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడదడగా ఉండటం, ఆందోళన వంటి అన్ని లక్షణాలు రక్తహీనతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనినే వైద్య పరిభాషలో 'ఎనిమియా' అని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే- రక్తంలో ఎర్ర రక్తకణాల మోతాదు తగ్గటం. రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్‌లెట్లు.. ఇలా మూడు రకాల కణాలుంటాయి. రక్తంలో 40-45 శాతం వరకు ఉండేవి ఎర్ర రక్తకణాలే. ఇవన్నీ ఎముక మజ్జ నుంచే పుట్టుకొస్తాయి. ఎర్ర రక్తకణాలు చేసే ఏకైక పని హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ, దీన్ని రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరవేయటం. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల మార్పిడిలో హిమోగ్లోబిన్ పాత్ర చాలా కీలకం. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను మోసుకెళ్లి, వివిధ అవయవాలకు చేరవేసేది ఇదే. అలాగే ఆయా భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను మోసుకొచ్చి, ఊపిరితిత్తులకు చేరవేస్తుంది కూడా. ఇలా మన ప్రాణాలు నిలవటానికి తోడ్పడుతుంది. ఇంతటి కీలకమైన పనిలో పాలు పంచుకుంటాయి కాబట్టే ఎర్ర రక్తకణాల సంఖ్య ఏమాత్రం తగ్గినా శరీరం జావగారుతుంది. చిన్న చిన్న పనులకే చేతులెత్తేస్తుంది. ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
తరచుగా వచ్చే నీరసాన్ని తగ్గించుకునేందుకు చిట్కాలు..
రక్తహీనత లక్షణాలు: