తెలంగాణ

telangana

ETV Bharat / health

వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతుంటాయ్ - కాటేస్తే వెంటనే ఇలా చేయండి! - Immediate Precautions to Snake Bite

Snake Bite Precautions: వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలోని పొదలు, గుంతల్లో.. ఇంకా పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. చూసుకోకుండా వాటిపై అడుగేస్తే కాటేస్తాయి. అలాంటి సమయంలో ఆందోళన చెందకుండా తక్షణమే కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 9:54 AM IST

Snake Bite Precautions
Immediate Precautions to Snake Bite (ETV Bharat)

Immediate Precautions to Snake Bite:వానాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇళ్ల పరిసరాలతోపాటు నడిచే మార్గాల్లోనూ తిరుగుతుంటాయి. చూసుకోకుండా వాటిపై అడుగు వేశారంటే రెప్పపాటులో కాటేస్తాయి. ఇలాంటి సమయంలో కంగారు పడకుండా కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇలా గుర్తించాలి:పాము కాటు వేస్తే ముందుగా ఏ ప్రాంతంలో వేసిందో గుర్తించాలి. నేరుగా శరీరంపై కాటువేసిందా? దుస్తులపై నుంచి కరిచిందా? అన్నది పరిశీలించాలి. తర్వాత ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాములు కాటేస్తే రెండు గాట్లు మాత్రమే పడతాయి. సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్టుగా కనిపిస్తుంది. రెండు కన్నా ఎక్కువ గాట్లు కనిపిస్తే అది విషం లేని పాముగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆందోళన వద్దు:పాము కాటుకు గురయ్యామన్న భయంతోనే చాలా మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో(WHO) నివేదిక ప్రకారం.. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. మన దేశంలో ఆ సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. పాము కరిచినప్పుడు ఆందోళన చెందకుండా.. ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. టెన్షన్​ పడితే.. రక్తం వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి.. ఆ రక్తంతో విషం వేగంగా శరీరం మొత్తం వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ప్రాణాలు రిస్క్​లో పడే పరిస్థితి వస్తుందంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన మొదటి అంశంగా సూచిస్తున్నారు.

తాడు కట్టాలి: పాము కాటు వేస్తే విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుంచి గుండెకు, ఆ తర్వాత అన్ని శరీర భాగాలకూ చేరుతుంది. ఇలా వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదు. కాబట్టి.. విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలని.. సూదిలేని సిరంజీని తీసుకుని ఆ గాట్లలో ఓ చోట పెట్టి రక్తాన్ని అందులోకి లాగాలంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు మొదట వచ్చే రక్తం కాస్తా నలుపు రంగులో ఉంటుందని.. అది విషతుల్యమైన రక్తం అని అర్థం చేసుకోవాలంటున్నారు. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయడం మంచిదంటున్నారు.

పాములు కాటేసే ముందు ఏం చేస్తాయో తెలుసా? - అప్పుడు మనుషులు ఏం చేయాలి?

క్లీన్​ చేయాలి: పాము కాటు వేసిన శరీర భాగాన్ని సబ్బు నీరు లేదా యాంటీ సెప్టిక్‌ లోషన్‌తో క్లీన్​ చేయాలని ప్రొఫెసర్, ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్‌ మెడిసిన్ పవన్‌కుమార్ సూచిస్తున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదలించకూడదని.. ముఖ్యంగా ఆ సమయంలో నడవటం, పరిగెత్తడం వంటివి చేయకూడదంటున్నారు. ఎందుకంటే అలా చేస్తే త్వరగా విషం శరీర భాగాల్లోకి వ్యాపించి.. ప్రాణాల మీదకి రావచ్చని హెచ్చరిస్తున్నారు.

వెంటనే చికిత్స: సాధ్యమైనంత తొందరగా బాధితుడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అప్పుడు వైద్యుడు పాము కరిచిన గుర్తులను ఆధారంగా చేసుకొని అది విష సర్పమా..? కాదా? నిర్ధారణ చేసి.. తగిన చికిత్స అందిస్తారు.

ఇవి చేయకూడదు: చాలా మంది కాటు వేసిన భాగం నుంచి నోటితో రక్తం పీల్చుతారు. అలా చేయకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఆ ప్రాంతంలో కణజాలాన్ని కత్తితో కత్తిరించడం సరికాదంటున్నారు. ఇక చివరగా మంత్రాలు, నాటు మందులు వంటివాటిని నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు.

మీకు తెలుసా? పాము కరిచినప్పుడు ఇలా చేస్తే ప్రాణాలు రక్షించొచ్చు!

'బస్సు అంత పొడవున్న పాము'- ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ అవశేషాలను కనుగొన్న సైంటిస్ట్​లు

ABOUT THE AUTHOR

...view details