Ice Facial Benefits and How to Do It: పార్టీ.. ఫంక్షన్.. మ్యారేజ్.. ఇలా అకేషన్ ఏదైనా అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలోనే బ్యూటీపార్లర్‌కు వెళ్లి వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటారు. అయితే ఇప్పుడు బ్యూటీ పార్లర్‌తో అవసరం లేకుండానే పార్లర్‌లాంటి మెరుపునిచ్చే ఫేషియల్ ఒకటి ఉంది. అది కూడా ఇంట్లో లభించే ఒకే ఒక్క పదార్థంతో చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫేషియల్ ఏంటి? ఎలా చేసుకోవాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
క్రయోథెరపీ:పార్లర్ వెళ్లకుండానే ఇంట్లోనే చేసుకునే ఫేషియల్ "ఐస్ ఫేషియల్". దీనినే వైద్య పరిభాషలో క్రయోథెరపీగా చెప్తారు. ఐస్ లేదా కోల్డ్ క్రంపెస్లను ఉపయోగించి.. ముఖంపై అప్లై చేసుకోవాలి. ఈ ఫేషియల్ మంచి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇక ప్రయోజనాలు చూస్తే..
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:చల్లని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెంది విస్తరిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మానికి ఆక్సిజన్, పోషకాల సరఫరాను పెంచుతుంది. దీనివల్ల స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది.
కళ్ల వాపు తగ్గుదల: చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ముఖం, కళ్లు ఉబ్బిపోతుంటాయి. అలాంటి సమయంలో ఈ ఐస్ ఫేషియల్ చేస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. దీని వల్ల కళ్ల వాపు తగ్గిపోతాయని, డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయని అంటున్నారు. అలాగే చర్మం చాలా హెల్దీగా ఉంటుందని.. పైగా ఉదయం దీనిని చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
సమ్మర్‌లో క్యారెట్ ఫేస్‌ప్యాక్స్ - ఇవి ట్రై చేశారంటే ముఖం తళతళా మెరిసిపోద్ది! - summer beauty tips
మొటిమల సమస్యలు ఉంటే:మొటిమలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్‌నెస్‌ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు. దీనివల్ల మొటిమలు చాలా సులభంగా తగ్గుతాయని.. అంతేకాకుండా చర్మంలో ఆయిల్ విడుదల కావడం తగ్గుతందని అంటున్నారు. అలాగే ఓపెన్ పోర్స్ నుంచి కూడా ఉపశమనం అందుతుందని చెబుతున్నారు.