తెలంగాణ

telangana

ETV Bharat / health

మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదా? - గుట్టు ఇలా తేల్చేయండి! - How to Know Pure Ghee Quality

How to Test Ghee Purity at Home : పిల్లల నుంచి పెద్దల వరకు నెయ్యి ఎంతో ఆరోగ్యకరం. అయితే.. చాలా మంది మార్కెట్లో లభించే నెయ్యినే కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ.. అది ఎంత వరకు స్వచ్ఛమైనదో తెలియదు. అందుకే.. మీకోసం కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. వీటి ద్వారా నెయ్యి క్వాలిటీని ఈజీగా చెక్ చేయొచ్చు!

How to Test Ghee Purity at Home
How to Test Ghee Purity at Home

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 5:09 PM IST

How to Test Ghee Purity at Home : నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఎముకల పటుత్వానికి ఎంతో సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అయితే.. నేటి కల్తీ ప్రపంచంలో ఆహారపదార్థాలు సైతం ఏ స్థాయిలో కల్తీ అవుతున్నాయో తెలిసిందే. దీంతో.. స్వచ్ఛమైన నెయ్యి దొరకడం గగనమైపోయింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉన్నవారికి దుకాణాల్లో దొరికే నెయ్యి మాత్రమే దిక్కవుతుంది. మరి.. అలా తెచ్చుకుని తింటున్న నెయ్యి మంచిదేనా? అనే సందేహం ఎప్పుడూ ఉంటుంది.

అందుకే.. నెయ్యి స్వచ్ఛతను గుర్తిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ.. ఎలా అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. మీక్కూడా తెలియకపోతే.. నెయ్యి కల్తీని గుర్తించే కొన్ని పద్ధతులు మేం పట్టుకొచ్చాం. ఈ పద్ధతులు ఫాలో అయిపోండి.. నీరు తింటున్న నెయ్యి క్వాలిటీ ఎంతో తేల్చేయండి. మరి.. ఆ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డస్ట్ పార్టికల్స్..

ఒక తెల్ల కాగితం లేదా ఓ ప్లేట్‌ తీసుకోండి. దానిపై కొద్ది మొత్తంలో నెయ్యి వేసి అలా వదిలేయండి. కొన్ని గంటలపాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చూసినప్పుడు.. కాగితంపై ఏదైనా డస్ట్ పార్టికల్స్, మలినాలు కనిపిస్తే.. ఆ నెయ్యి కల్తీ అని అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛమైన నెయ్యిలో ఎలాంటి చెత్తా చెదారమూ కనిపించదు.

క్లారిటీ..

స్వచ్ఛమైన నెయ్యి అంతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చూడ్డానికి చాలా మృదుగా కనిపిస్తుంది. అలా కాకుండా జిడ్డుగా ఒకరకంగా కనిపిస్తే కల్తీ జరిగిందని భావించొచ్చు. రూమ్​ టెంపరేచర్​లో స్వచ్ఛమైన నెయ్యి వాటర్​ రూపంలోకి మారుతుంది. కల్తీ నెయ్యి గడ్డలుగా విడిపోయి ఉండొచ్చు.

ఫ్లేమ్ టెస్ట్..

నెయ్యి క్వాలిటీని చెక్ చేసేందుకు ఒక పాన్‌ పై.. టీస్పూన్ నెయ్యి వేయండి. స్టౌ వెలిగించి దాన్ని వేడిచేయండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే.. పెద్దగా పొగ రాదు. చక్కటి సువాసన వస్తుంది. ఇంకా.. త్వరగా కరిగిపోతుంది. కానీ.. కల్తీ నెయ్యి అయితే మాత్రం ఎక్కువగా పొగ వస్తుంది. ఇంకా.. క్లాత్ కాలిన వాసన వస్తుంది.

వాటర్ టెస్ట్..

నెయ్యి స్వచ్ఛతను నీటిలో కూడా పరీక్షించొచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. అందులో కొద్ది మొత్తంలో నెయ్యి కలపాలి. అది స్వచ్ఛమైన నెయ్యి అయితే పూర్తిగా కరిగిపోతుంది. నీరు స్పష్టంగా ఉంటుంది. కానీ.. కల్తీ నెయ్యి అయితే నీటిమీద తేలి విడిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా మలినాలు కూడా కనిపిస్తాయి.

ఫ్రిజ్ పరీక్ష..

మీ నెయ్యిని కొన్ని గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే.. మంచు ముద్దలాగ గట్టిపడుతుంది. అందులో ఏ విధమైన పగుళ్లు వంటివి కనిపించవు. కల్తీ నెయ్యి అయితే మాత్రం పొరలు పొరలుగా కనిపిస్తుంది. ఇది తక్కువ క్వాలిటీకి సంకేతం.

స్టెయిన్ టెస్ట్..

తెల్లటి క్లాత్​పై కొద్ది మొత్తంలో నెయ్యి వేయండి. కొన్ని గంటలు అలా ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే.. ఎండిపోయిన తర్వాత మరకలు వంటివి ఏమీ కనిపించవు. అలా కాకుండా.. నెయ్యి ప్రాంతంలో మరకలు ఉన్నా.. క్లాత్​ రంగులో తేడా వచ్చినా.. ఏవైనా అవశేషాలు అంటుకుని ఉన్నా.. అది కల్తీ అయ్యిందని అర్థం.

చివరగా టేస్ట్ టెస్ట్..

స్వచ్ఛమైన నెయ్యి రుచి అద్భుతంగా ఉంటుంది. లేత బంగారు రంగులో ఉండే నెయ్యి.. మనోహరమైన సువాసన కలిగి ఉంటుంది. కల్తీ నెయ్యి మాత్రం కాస్త చేదుగా ఉంటుంది. రుచిలో కూడా తేడా ఉంటుంది. ఈ మార్గాల ద్వారా.. మీరు తినే నెయ్యి మంచిదో కాదో తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details