Best Ways to Storage Ginger :ప్రతి ఒక్కరి వంటగదిలో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. దీనిని డైలీ వివిధ వంటకాల్లో యూజ్ చేస్తుంటాం కూడా. ఇక మాంసాహారం వంటల్లో అయితే అల్లం కచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేని వంటకాలను అసలు ఊహించుకోలేరు. అదే విధంగా అల్లం(Ginger)లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, దీని ధర మార్కెట్లో మిగతా మసాలా దినుసుల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఇది అధిక వేడి కారణంగా త్వరగా పాడైపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అల్లాన్ని ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే జింజర్‌ను చాలా కాలం ఎండిపోకుండా ఫ్రెష్‌గా స్టోర్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫ్రెష్ అల్లం కొనండి : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అల్లం కొనుగోలు చేసేటప్పుడు సరిగ్గా చూడకుండా కొనేస్తుంటారు. అయితే, అల్లం త్వరగా పాడైపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని జింజర్ కొనుగోలు చేసేటప్పుడు ఫ్రెష్‌గా ఉండే అల్లాన్ని ఎంచుకోవాలి. అంటే గట్టిగా, మందంగా, లేతగా ఉండే దాన్ని కొనుగోలు చేయాలంటున్నారు నిపుణులు. అంతేకానీ, మెత్తగా, రంధ్రాలున్న, ముడతలు పడిన అల్లాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.
అల్లంపై పొట్టు తీయవద్దు : అల్లం ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని.. అల్లం తెచ్చాక దానిపై పొట్టు తీయకుండా ఉండడం. అంటే అవసరానికి కావాల్సిన దాన్ని పొట్టు తీసి వాడుకోవాలి. మిగతా దాన్ని పొట్టు తీయకుండా ఉంచుకోవాలి. పైపొట్టు అల్లానికి రక్షణగా ఉంటూ ఎక్కువకాలం పాడవకుండా కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.