How To Store Bananas For Long Time: సామాన్యుడు కూడా సందేహం లేకుండా కొనుక్కుని తినే పండు అరటిపండు. అలాగని చీప్‌గా మాత్రం తీసిపడేయకండి. ధర తక్కువే అయినా దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువే. ప్రతి రోజు ఒక అరటిపండు తినడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే దీంట్లో లభించే థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-బీ6, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు అవసరం.
ఇన్ని లాభాలు కలిగించే ఈ పండుతో చిక్కేంటంటే, ఇవి కొన్న కాసేపటికే పండిపోతాయి. నల్లగా, మెత్తగా మారి తినడానికి ఆసక్తి కలిగించవు. అయితే వీటిని కొనేముందు ముందు, కొనుగోలు చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ కాలం నిల్వ చేయచ్చు. అదెలాగంటే?
ఉష్ణోగ్రత:అరటిపండు పక్వానికి రావడంలో టెంపరేచర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పూర్తిగా పండకుండా ఉండాలంటే వీటిని తీవ్రమైన చలి లేదా ఎక్కువ వేడికి దూరంగా ఉంచాలి. చల్లటి ప్రదేశంలో ఉంటే అస్సలు పండకుండా ఉంటాయి. వేడి ప్రదేశంలో ఉంచితే ఎక్కువ పండిపోతాయి. కాబట్టి అరటిపండ్లు ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.
వెలుతురు:అరటిపండ్లు ఎక్కువ కాలం ఉండాలంటే సూర్యుని వెలుతురు నేరుగా వీటిపై పడకుండా చూసుకోవాలి. సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల పండ్ల మీద గోధుమ రంగు, నల్లటి మచ్చలు ఏర్పడటం సహాత్వరగా పక్వానికి వస్తాయి.
ఇథిలిన్ గ్యాస్:ఈ పండ్ల నుంచి ఇథిలిన్ గ్యాస్ విడుదల అవుతుంది. ఇది వీటిని త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. కాబట్టి వీటిని మూసి ఉంచినట్టుగా కాకుండా చక్కగా గాలి తగిలే ప్రదేశంలో అరటిపండ్లను ఉంచిదే ఇథిలిన్ గ్యాస్ నుంచి తప్పించుకుని అరటిపండ్లు ఎక్కువ కాలం పండకుండా ఉంటాయి.