How to Stop Falling Asleep at Work : పని వేళల్లో నిద్ర వస్తే ఎంతో చిరాకును తెప్పిస్తుంది. మధ్యాహ్న భోజనం చేసిన తరవాత శరీరం ఏమాత్రం పని చేసేందుకు సహకరించదు. దీంతో పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. ఇది చాలా మందిలో మామూలుగా ఉండే సమస్యే. కానీ రోజంతా ఇలాగే ఉంటే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ. అసలు ఈ సమస్య తలెత్తడానికి కారణాలేంటి! నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం :రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. భోజనం చేసిన 3 నుంచి 4 గంటల తరవాత నిద్రకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు. వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేసేలా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. లేట్ నైట్స్ ఏ ఆహారం అయినా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం :ప్రస్తుతం కాలంలో చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అవసరానికి మించి వీటిపై తమ అముల్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని భోజన సమయానికి ముందు వరకు పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు.
సరైన నిద్ర కూడా అవసరమే! :మంచి నిద్ర కావాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా బాగుండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. పడుకునే ముందు గదిలోకి వెలుతురు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో నిద్ర బాగా పడుతుందంటున్నారు.
ఆల్కహాల్ వినియోగం :ఆల్కహాల్ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేరని, ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.