How To Solve Urine Leakage Problem : మహిళల్లో సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రవిసర్జన ఎక్కువవుతుందని, దీనికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మూత్రం వస్తున్నట్టు అనిపించిన వెంటనే.. వాష్‌రూమ్‌కు పరిగెత్తాల్సి వస్తుంది. కొన్నిసార్లు బాత్రూమ్‌కువెళ్లేలోపే బట్టల్లోనే పడిపోవచ్చు. ఇలాంటి సమస్యను 'యూరినరీ ఇన్‌కాంటినెన్స్' అంటారు.
మూత్రం లీకవడానికి కారణాలు ఏంటి?
- మూత్రం ఆపలేకపోవడం అనే సమస్య పురుషుల్లో కన్నా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందట. దీనికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
- పునరుత్పత్తి, మూత్ర అవయవాలనిర్మాణం.. కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్లలో మార్పులు రావడం వంటివి ప్రధాన కారణాలు.
- అలాగే మహిళల్లో మూత్రమార్గం చిన్నగా.. పైగా తిన్నగా ఉంటుంది. దీనివల్ల మూత్రం త్వరగా బయటకు వచ్చే అవకాశముంది.
- వయసు పెరుగుతున్నా కొద్ది కటి, మూత్రాశయ కండరాలు వదులవుతూ వస్తుంటాయి.
- అలాగే కాన్పు సమయంలో జననాంగ మార్గం నుంచి బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కటి కండరాలు సాగటం, బలహీనపడటం కూడా ఈ సమస్య పెరిగేలా చేయొచ్చు.
- మూత్రాశయం, గర్భసంచి కిందికి జారటం వల్ల కూడా మూత్రం ఆపుకోలేకపోవడానికి కారణం కావొచ్చు.
- బరువు ఎక్కువగా ఉన్నా కూడా పొట్టలో కొవ్వు ఎక్కువై పోయి మూత్రాశయం మీద బరువు పడుతుంది. దీనివల్ల లీకేజీ సమస్య ఏర్పడుతుందని నిపుణులంటున్నారు.
ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి ?