తెలంగాణ

telangana

ETV Bharat / health

స్కార్ఫ్‌ ధరిస్తే మొటిమలు వస్తున్నాయా? - క్రీమ్స్ వాడకుండా ఇలా తగ్గించుకోండి! - Pimple Problems in telugu

How To Solve Pimple Problem : చాలా మంది అమ్మాయిలు స్కార్ఫ్‌ ధరిస్తుంటారు.. ఇప్పటికీ కొందరు మాస్క్ వేసుకుంటున్నారు. వీటివల్ల మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే.. ఈ సమస్యను ఎటువంటి క్రీమ్స్‌ వాడకుండానే ఎలా తగ్గించుకోవాలో మీకు తెలుసా?

How To Solve Pimple Problem
How To Solve Pimple Problem

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 5:18 PM IST

How To Solve Pimple Problem : చాలా మంది అమ్మాయిలు వివిధ కారణాలతో ముఖాన్ని స్కార్ఫ్​తో కవర్ చేసుకుంటారు. ఎండవేడి నుంచిరక్షించుకోవడానికి కొందరు.. కాలుష్యం దరిచేరకుండా మరికొందరు ధరిస్తుంటారు. కొవిడ్‌ సమయంలో వచ్చిన మాస్క్‌.. ఇప్పటికీ కొందరు ధరిస్తూనే ఉన్నారు. అయితే.. ఇలా మాస్క్‌లు, స్కార్ఫ్‌ వంటివి వేసుకోవడం వల్ల కొంత మందిలో మొటిమలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల వారు నలుగురిలో కలవలేక చాలా ఇబ్బంది పడతుంటారు. అయితే, ఈ సమస్య నుంచి ఈజీగా ఎలా గట్టెక్కాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా చేస్తే మొటిమలకు చెక్‌!

  • రోజూ పరిశుభ్రంగా ఉండే మాస్క్‌లు, స్కార్ఫ్‌లనే ధరించాలి.
  • ముఖంపై ఉన్న జిడ్డు, నూనెను తొలగించడానికి ముఖాన్ని సబ్బుతో కడుక్కోవాలి.
  • కొంత మంది ముఖంపై మొటిమలు ఏర్పడితే వాటిని గిల్లడం, గించడం లాంటి పనులు చేస్తుంటారు.
  • ఇలాంటి పనులు అస్సలు చేయకూడదని నిపుణులంటున్నారు. దీనివల్ల అవి తగ్గకపోగా.. మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
  • మొటిమలు ఎక్కువగా ఉంటే కొన్ని రోజులు మేకప్‌ వేసుకోకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
  • 2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మొటిమల సమస్యతో బాధపడేవారు 8 వారాల పాటు మేకప్‌ వేసుకోకపోవడం వల్ల వారిలో ఆ తీవ్రత తగ్గిందని పరిశోధకులు గుర్తించారు.
  • మాస్క్‌లు వాడిన తర్వాత వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
  • అలాగే మొటిమలు ఏర్పడటానికి మరో కారణం సరైన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోకపోవడమేనని నిపుణులంటున్నారు. కాబట్టి, మీరు ధరించే మాస్క్‌, స్కార్ఫ్​ ఫ్యాబ్రిక్‌ మెత్తగా ఉండేలా చూసుకోండి.
  • మొటిమల సమస్య ఎక్కువగా ఉంటేకొవ్వు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
  • రోజువారీ ఆహారంలో పోషకాలు, పిండి పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలి.
  • ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు అయి ఉండవచ్చు. కాబట్టి, ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజూ యోగా, ధ్యానం వంటి వాటిని జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలని చెబుతున్నారు.
  • అలాగే రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులు, సాధనాలను కొన్ని రోజులు దూరంగా పెట్టాలి.
  • శరీరానికి సరిపడినంత నీరు తాగకపోతే కూడా మొటిమలు రావొచ్చు. కాబట్టి, రోజుకు 8 గ్లాసుల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇంకా కొబ్బరి నీళ్లను కూడా తాగొచ్చని అంటున్నారు.
  • ఇవన్నీ పాటించినా కూడా ముఖంపై మొటిమలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడు వారు క్రీమ్స్‌తో పాటు కొన్ని రకాల మందులను సూచిస్తారు. దీంతో పింపుల్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details