తెలంగాణ

telangana

ETV Bharat / health

నెయిల్ ఆర్ట్​ ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి- గోళ్లకు రంగులు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - Tips for Nail Art Stay Longer - TIPS FOR NAIL ART STAY LONGER

Tips For Nail Art Stay Longer : పండుగలు, శుభకార్యాలయాలు ఉన్నాయంటే చాలు అమ్మాయిలు అందంగా సింగారించుకోవాలనుకుంటారు. అందు కోసం దిరిపోయే డ్రస్సు, మ్యాచింగ్ యాక్సెసరీస్, స్పెషల్ నెయిల్ ఆర్ట్​లను సిద్ధం చేసుకుంటారు. అలా వేసుకున్న నెయయిల్ ఆర్ట్​ ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Tips For Nail Art Stay Longer
Tips For Nail Art Stay Longer (Getty Images)

By ETV Bharat Health Team

Published : Sep 23, 2024, 11:55 AM IST

Tips For Nail Art Stay Longer :శుభకార్యాలు, పండుగల సమయంలో మహిళలు అందంగా ముస్తాబై కనిపించాలనుకుంటారు. నలుగురి దృష్టిని తమవైపు తిప్పుకోవాలని చూస్తుంటారు. అందుకోసం వేసుకునే డ్రెస్ నుంచి కాళ్లకు తొడిగే చెప్పుల వరకూ ప్రతిదీ మ్యాచ్ కావాలనుకుంటారు. అందులో భాగంగా అదిరిపోయే డ్రస్సు, మ్యాచింగ్ యాక్సెసరీస్, స్పెషల్ నెయిల్ ఆర్ట్​లు... మొదలైన వాటిని ప్రత్యేకంగా ఎంచుకుంటారు. అలా మీరు ఎంతో ఇష్టంగా వేసుకునే నెయిల్ ఆర్ట్​ ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? ఇష్టంగా వేసుకున్న మీ నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఏంచేయాలో ఈ స్టోరీలో తెసుకుందాం.

అవసరమైతేనే పెంచుకోండి :మీకు ఇష్టం అని గోళ్లు ఎంత పెరిగితే అంత పొడుగూ పెంచేసుకోకూడదంటున్నారు నిపుణులు. మీరు రోజువారీ చేసే పనులను దృష్టిలో పెట్టుకుని ఎంతమేరకు అవసరమైతే అంతే పెంచుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. లేదంటే రోజువారీ పనులు చేసుకునే సమయంలో, కీబోర్డు మీద టైప్ చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు ఇలా పలు సందర్భాల్లో పొడవాటి గోళ్లు తొందరగా విరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయంటున్నారు నిపుణులు. అందుకే మీ పనులకు ఆటంకం కలగనంతవరకు గోళ్లను పెంచుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

నెయిల్ ఆర్ట్ దెబ్బతినే ప్రమాదం : మీరు నెయిల్ ఆర్ట్ వేసుకున్న పొడవాటి గోళ్లు విరిగిపోతే ఆర్ట్ కూడా సగం పోయి అందాన్ని కోల్పోతుంది. అందుకే మీకు కావలసినంత వరకే గోళ్ల పొడవును ఉంచుతూ ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సరిగా అతుక్కోవాలంటే : మీరు వేసుకునే నెయిల్ పాలిష్ గోళ్లకు సరిగా అతుక్కోవాలంటే, ముందుగా ఇంతకు ముందు వేసిన రంగుల అవశేషాలను పూర్తిగా పోయేలా నెయిల్పాలిష్ రిమూవర్‌తో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

ఎక్కువ కాలం : నెయిల్ ఆర్ట్ వేసుకునే ముందు గోళ్లను యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొన్ని నిమిషాల పాటు ముంచి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మనం వేసుకునే ఆర్ట్ గోళ్లకు బాగా పడుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా మీ నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుందంటున్నారు నిపుణులు.

గోరువెచ్చని నీళ్లలో : ఈ పద్ధతి వీలుకాకుంటే సోప్ కలిపిన గోరువెచ్చని నీళ్లలో గోళ్లను కాసేపు ముంచి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. తర్వాత బయటకు తీసి ఒక పొడి క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలంటున్నారు. లేదంటే నిమ్మరసంలో 8 నుంచి 10 నిమిషాల పాటు ముంచి, తర్వాత శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గోళ్లు గట్టిపడటమే కాదు, గోళ్లు పసుపు రంగులోకి మారడం అనే సమస్యని దరి చేరనీయదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

స్మూత్‌గా ఉండేలా : నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ముందు మీ గోళ్లను సిద్ధం చేసుకోవాలి. అంటే రిమూవర్‌తో ఒకసారి శుభ్రపరిచి, అనంతరం వాటిని షేప్ చేసి అవసరమైతే ఫైలింగ్ చేసి స్మూత్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రెండు సార్లు : గోళ్లను సిద్ధం చేసుకున్న తర్వాత నాణ్యమైన నెయిల్‌పాలిష్ ఎంచుకుని, మీకు నచ్చిన నెయిల్ ఆర్ట్‌ని వేసుకోవాలి. చివరిగా టాప్‌కోట్ కూడా వేసుకోవాలి. ఇక్కడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో ముందుగా ఒక కోటింగ్ పలుచగా వేసి, అనంతరం అది ఆరిన తర్వాత దాని మీద రెండో కోటింగ్ వేసుకోవాలి. ఆ తర్వాతే నెయిల్ ఆర్ట్ వేసుకోవాలి. అయితే, ఆర్ట్ వేసుకునేటప్పుడు ఉపయోగించే స్టోన్స్, బీడ్స్... వంటివి అతికించడానికి నెయిల్ గ్లెన్ మాత్రమే వాడాలి.

ఇలా చేస్తే గోళ్లకు అతుక్కోదు : మీరు ఎంచుకునే నెయిల్‌పాలిష్ కొట్టొచ్చినట్లు కనిపించాలనే తాపత్రయంతో ఎక్కువ కోటింగ్స్ వేస్తే గోళ్లకు అతుక్కోదు, అది మందంగా మారి మొత్తం ఆర్ట్ అందాన్ని పూర్తిగా చెడగొటే ప్రమాదం ఉంటుంది. ఇక నెయిల్ ఆర్ట్ వేసుకోవడం పూర్త్తెన తర్వాత కొంతసేపటి వరకు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లలో మీ గోళ్లను ముంచి ఉంచితే నెయిల్‌పాలిష్ తొందరగా గట్టిపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ కాలం నిలిచి ఉంటుందంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

హెచ్చరిక : మీరు తరచుగా నెయిల్ పాలిష్ వాడుతున్నారా? - మీ ఆరోగ్యానికి ఏం జరుగుతుందో తెలుసా? - Nail Polish Removing Side Effects

మీ గోళ్లు తేలిగ్గా విరిగిపోతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే బలంగా, పొడవుగా పెరుగుతాయి!

ABOUT THE AUTHOR

...view details