How To Rid Warts Naturally : మెడ, ముఖం, వీపు, చేతులు.. ఇలా శరీర భాగాల్లో పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. నిజానికి వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకపోయినా.. ఇవి అందాన్ని మాత్రం దెబ్బతీస్తాయి. కొంత మంది శరీరంపై పులిపిర్లు ఎక్కువగా ఏర్పడటం వల్ల ఆత్మస్థైర్యం కోల్పోతుంటారు. వీటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం వల్ల పులిపిర్ల సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పులిపిర్లు ఎందుకు ఏర్పడుతాయి ?
పులిపిర్లు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వల్ల వస్తాయి. ఈ వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత అదనపు కణాలు పెరిగేలా చేస్తుంది. కొంత మందిలో పులిపిర్లు చిన్నగా ఏర్పడితే, ఇంకొంత మందిలో కొద్దిగా పెద్దగా ఉంటాయి.
అల్లంతో పులిపిర్లు మాయం :
మనందరి ఇళ్లలోనూ అల్లం కచ్చితంగా ఉంటుంది. దీనిని వంటలు రుచిగా ఉండటానికి కూరల్లో వేస్తుంటాం. అయితే, అల్లంతో పులిపిర్లను మాయం చేసుకోవచ్చని మీకు తెలుసా ? అది ఎలా అంటే, ముందుగా ఒక అల్లం ముక్కను తీసుకుని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని చర్మంపై ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు అల్లం పేస్ట్‌ను పులిపిర్ల దగ్గర పెట్టుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే అవి రాలిపోతాయని నిపుణులంటున్నారు. 2022లో ప్రచురించిన 'Journal of Complementary and Integrative Medicine' నివేదిక ప్రకారం, పులిపిర్లతో బాధపడుతున్న వారు అల్లం పేస్ట్‌ను రోజుకి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల వాటి పరిమాణం, సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారట. దాదాపు 60కి పైగా రిపోర్టులు, క్లినికల్ ట్రయల్స్, ప్రయోగాలు, చికిత్స విధానాలు, చికిత్స అనంతరం ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత.. ఈ నివేదికను ప్రచురించినట్టు డాక్టర్ లియో పేర్కొన్నారు.
పైనాపిల్‌తో :
రోజూ పైనాపిల్ రసాన్ని పులిపిర్లపై రాసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే అవి తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయ రసం :
పులిపిర్లతో బాధపడేవారు వాటిని తొలగించడానికి ఉల్లిపాయలను ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే ముందుగా ఉల్లిపాయలను రసంగా చేసుకుని పులిపిర్లపై రాయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాటంతట అవే రాలిపోతాయట.