తెలంగాణ

telangana

ETV Bharat / health

పురుషుల్లో మొటిమల సమస్య - ఇలా చెక్ పెట్టండి!

Tips to Remove Acne in Men: మొటిమలు.. ఈ సమస్య పేరెత్తగానే అమ్మాయిలే గుర్తుకు వస్తారు. కానీ.. అబ్బాయిలను సైతం ఈ ప్రాబ్లమ్ వేధిస్తుంది. మరి, పురుషుల్లో వచ్చే మొటిమలను ఎలా తగ్గించుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

How to Remove Acne in Men
How to Remove Acne in Men

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 1:50 PM IST

How to Remove Acne in Men: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొనే కామన్‌ సమస్య మొటిమలు. అయితే.. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటే.. ఇంకొందరికి కాస్త తక్కువగా వస్తుంటాయి. ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ అయినప్పటికీ.. పురుషులు సైతం ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరి, మగవారిలో ఈ మొటిమలు రావడానికి కారణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!

మొటిమలు ఎందుకు వస్తాయి..?:మొటిమలు రావడానికి ఇదే ప్రత్యేక కారణం అని ఏమి లేదు. ముఖానికి వాడే క్రీములు, ఆయిల్ ఫుడ్స్, హార్మోన్ల మార్పులు, కాలుష్యం, అధిక ఒత్తిడి, ఫ్యామిలీ హిస్టరీ.. ఇలా పలు కారణాల వల్ల వస్తుంటాయి. అంతేకాకుండా ముఖంలోని సేబాషియస్ గ్రంథులు అదనపు జిడ్డుగల గమ్‌ను విడుదల చేయడం వల్ల మొటిమలు వస్తాయి. మరి ఈ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం.

ఫేస్​వాష్​:డైలీ ఫేస్​వాష్​ చేయడం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే సమస్య తగ్గుతుంది. తేలికపాటి క్లెన్సర్లతో రోజుకు ఒకసారి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్​ అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా బయటికి వెళ్లేముందు సన్​స్క్రీన్​ లోషన్​ అప్లై చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. చాలా మంది 3 ఇన్​ 1 బాడీ జెల్​ యూజ్​ చేస్తారు. అది ఎప్పటికీ ఉపయోగించవద్దు.

స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉందా? - సమస్యలు తప్పవట!

షేవింగ్​:చాలా మంది పురుషులు చేసే బిగ్​ మిస్టేక్​ ఏంటంటే.. మొటిమలు, మచ్చలపై బ్లేడ్​ లేదా ఎలక్ట్రిక్​ రేజర్లు ఉపయోగించి షేవింగ్​ చేస్తారు. అలా చేయడం వల్ల మచ్చలు శాశ్వతంగా ఫేస్​పై ఉంటాయి. రేజర్ల ప్లేస్​లో ట్రిమ్మర్లు యూజ్​ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఈ మొటిమల సమస్యను తగ్గించవచ్చు.

ఉల్లిరసం..:మొటిమల చుట్టూ ఉండే ఎర్రదనం, వాపు వంటి సమస్యలు తగ్గుముఖం పట్టించడంలో ఉల్లిరసం ముందువరుసలో ఉంటుంది. రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఉల్లిముద్దని వడపోయడం ద్వారా ఉల్లిరసం మనకు లభిస్తుంది. అందులో ఒక కాటన్ బాల్‌ని ముంచి మొటిమలపై మృదువుగా అద్దుకోవాలి. ఆ తర్వాత వాటిని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి ముఖం శుభ్రం చేసుకోవాలి. మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడుకున్న తర్వాత చర్మానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్ కూడా రాసుకోవాలి.

ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా!

ఐస్‌క్యూబ్..:మొటిమల చుట్టూ ఉండే ఎర్రదనం, వాపు.. వంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడే వాటిలో ఐస్‌క్యూబ్ కూడా ఒకటి. వీటిని ఒక మెత్తని క్లాత్‌లో వేసి దాంతో మొటిమలు ఉన్న చోట మెల్లగా కొద్ది సెకన్ల పాటు అద్దుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేయడం ద్వారా మొటిమలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అయితే.. ఇందుకు సాధారణ ఐస్‌క్యూబ్స్ కాకుండా గ్రీన్ టీతో తయారుచేసినవైతే మరీ మంచిది. మొటిమలు తగ్గుముఖం పట్టడంతోపాటు చర్మం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

తరచుగా నడుము నొప్పి వేధిస్తోందా? - ఈ వ్యాయామాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు!

బీ అలర్ట్​ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details