PCOD Ayurvedic Remedies:ఈ మధ్య కాలంలో మహిళలను పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్(పీసీఓడీ) ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడంతో పాటు పీరియడ్స్ కూడా అస్తవ్యస్తంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అనేక మందులు వాడుతుంటారు. అయితే, ఈ సమస్యకు ఆయుర్వేద పద్ధతిలో చక్కటి పరిష్కార మార్గం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔషధం ఎలా తయారు చేసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు గాయత్రీ దేవి వివరిస్తున్నారు.
కావాల్సిన పదార్థాలు
- 25 గ్రాముల మెంతుల చూర్ణం
- 25 గ్రాముల వేపాకుల చూర్ణం
- 25 గ్రాముల పసుపు
- 25 గ్రాముల తిప్పతీగ చూర్ణం
- 25 గ్రాముల నేల వేము చూర్ణం
- 25 గ్రాముల ఉసిరి చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో మెంతులు, వేపాకు, పసుపు, తిప్పతీగ, నేల వేము, ఉసిరి చూర్ణం వేసి బాగా కలపాలి.
- అనంతరం స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో 60 మిల్లీ లీటర్ల నీటిని పోసి సన్నటి మంటపై మరిగించుకోవాలి.
- ఇప్పుడు మిశ్రమాన్ని అందులో వేసుకుని సగం ఆవిరయ్యే వరకు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత దీనిని వడపోసుకుని తీసుకుంటే ఔషధం రెడీ!
- ఇంకా దీనికి రుచికి కావాలంటే కొంచెం పటిక బెల్లం వాడాలని చెబుతున్నారు.
- 5-10 గ్రాముల మిశ్రమాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు కషాయంలో కాచుకోవాలని వివరిస్తున్నారు.
- సుమారు 5-6 నెలల పాటు ఉదయం, సాయంత్రం తీసుకోవాలని చెబుతున్నారు.
మెంతులు: ఇది ఇన్సులిన్ హర్మోన్లో ఉండే అసమతుల్యతను తగ్గించేందుకు తోడ్పడుతుందని గాయత్రీ దేవి చెబుతున్నారు.
వేపాకులు: మన శరీరంలో ఉండే హర్మోన్ల సమస్యను తగ్గించడంలో వేపాకులు చాలా బాగా సహాయపడతాయని వివరిస్తున్నారు.
పసుపు: దీనిని అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతుంటారు. పసుపు కూడా హర్మోన్ల అసమతుల్యతను అరికడుతుందని వివరిస్తున్నారు.