ETV Bharat / state

నేడు కేబినెట్ భేటీ - రైతు భరోసా, సన్న బియ్యం పంపిణీపై సాయంత్రానికి క్లారిటీ - CABINET MEETING IN TELANGANA

సీఎం అధ్యక్షతన నేడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం - రైతు భరోసా విధివిధానాలు, అర్హతలపై చర్చలు

CABINET MEETING ON FARMER ASSURANCE
Cabinet Meeting In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 7:06 AM IST

Updated : Jan 4, 2025, 7:14 AM IST

Telangana Cabinet Meeting Today : రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గత నెల 30నే మంత్రిమండలి భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినందున వాయిదా పడింది. రైతు భరోసా విధివిధానాలు, అర్హతలు నేడు ఖరారు కానున్నాయి.

పంట వేసిన వారందరికీ రైతు భరోసా : సుదీర్ఘ సంప్రదింపులు, చర్చల తర్వాత రైతు భరోసాపై కేబినెట్ సబ్​ కమిటీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. ఇవాళ మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని, ఆదాయ పన్ను చెల్లింపు, ఎకరాల పరిమితి ఉండొద్దని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సిఫార్సు చేసింది.

రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు : అయితే ఒకేసారి రూ.7,500 ఇవ్వాలా లేక ముందుగా రూ.6 వేలు ఇచ్చి క్రమంగా పెంచాలా అనే అంశంపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. భూమి లేని పేదలకు భృతిపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి దరఖాస్తుల స్వీకరణతో పాటు సన్న బియ్యం పంపిణీపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చునని సమాచారం.

రేషన్ కార్డులపై సన్నబియ్యం : రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల 96 వేల రేషన్ కార్డులు దాదాపు 2 కోట్ల 81 లక్షల లబ్ధిదారులు ఉండగా, సుమారు కోటి 70 లక్షల సన్నబియ్యం అవసరమని అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీలు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను కేబినెట్ పరిశీలించనుంది. సర్వేలో తేలిన అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్​కు సర్వే గణాంకాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఇచ్చిన నివేదిక, ఎస్సీ వర్గీకరణ కమిషన్​పై కూడా చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

నూతన టూరిజం పాలసీ : నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్రంలో సాగునీటి సంఘాల పునరుద్ధరణపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ - క్రమబద్దీకరణకు అవకాశంలేదన్న సీఎం

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ ప్రక్రియ ఆలస్యం కావొద్దు : సీఎం రేవంత్‌

Last Updated : Jan 4, 2025, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.