తెలంగాణ

telangana

ETV Bharat / health

'విటమిన్ బీ 12 లోపంతో రక్తహీనత సమస్య'- ఈ ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట! - VITAMIN B12 DEFICIENCY RICH FOODS

-విటమిన్ బీ 12 డెఫిషియెన్సీతో ఆరోగ్య సమస్యలు! -పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకోండి

vitamin b12 deficiency rich foods
vitamin b12 deficiency rich foods (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 1, 2025, 1:24 PM IST

Vitamin b12 Deficiency Foods:ఈ మధ్య కాలంలో చాలా మంది బీ 12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్‌ బి-12 రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని.. ఇది లోపిస్తే మెగా లోబ్లాస్టిక్‌ అనీమియాకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసమే విటమిన్ అధికంగా లభించే పదార్థాలను విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విటమిన్‌ ఎక్కువగా జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Nutritionలో ప్రచురితమైన "Vitamin B12 content of animal products" అనే అధ్యయనంలోనూ తేలింది. ఇంకెందుకు ఆలస్యం విటమిన్ బీ 12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మాంసాహారం : మాంసాహార పదార్థాలలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వారంలో కొన్నిసార్లు మీ డైట్​లో మాంసాహారాన్ని చేర్చుకోవడం వల్ల తగిన మొత్తంలో విటమిన్ B12 అందుతుందని అంటున్నారు. అయితే, అందులో కొవ్వు శాతం తక్కువగా ఉండేవి ఎంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

పాలు: పాలలో కూడా విటమిన్ బీ 12 ఎక్కువగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక కప్పు పాలలో రోజుకి కావాల్సిన కాల్షియం 20శాతం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం రోజూ పాలు తాగడం వల్ల విటమిన్‌-12ను శరీరానికి అందించవచ్చని వివరిస్తున్నారు.

పెరుగు: పాలతో పాటు డెయిరీ సంబంధిత పదార్థమైన పెరుగులో కూడా విటమిన్‌-12 పుష్కలంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక కప్పు పెరుగులో 28శాతం విటమిన్‌-12 లభిస్తుందని చెబుతున్నారు. అందుకే విటమిన్‌ లోపంతో బాధపడుతున్నవారు రోజూ పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

గుడ్లు: గుడ్లలో విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో ఇది ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. అందుకే కేవలం ఎగ్​ వైట్​నే కాకుండా గుడ్డు మొత్తాన్నీ ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు. రెండు గుడ్ల నుంచి 1.1 మైక్రోగ్రాముల B 12 విటమిన్ అందుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

తృణధాన్యాలు: తృణధాన్యాలు అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఒక కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలని సూచిస్తుంటారు. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్‌-12 పుష్కలంగా లభిస్తుందని వివరిస్తున్నారు.

సోయా పనీర్‌: సోయా పాలతో చేసిన టోఫుల్లో విటమిన్-12 పుష్కలంగా దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని బీన్‌ పెరుగు అని కూడా పిలుస్తుంటారు. దీనిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్ బీ 12 సమస్యను అధిగమించవచ్చని వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లలు పుట్టడంలేదని బాధపడుతున్నారా? దంపతులిద్దరూ ఇది తాగితే సంతానం కలిగే ఛాన్స్!

ఇంట్లోని పదార్థాలతో నేచురల్ ఫేస్ పీల్స్- ఇవి వేసుకుంటే ముఖం మెరిసిపోతుందట!

ABOUT THE AUTHOR

...view details