How to Make Coffee Mask : ముఖం ఉబ్బినట్లుగా తయారవడం, చర్మం పొలుసులుగా ఊడిపోవడం లాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే, అలాంటి సమస్యలకు ఈ కాఫీ స్క్రబ్/ఫేస్‌మాస్క్ చక్కటి పరిష్కారం చూపుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ ఫేస్‌మాస్క్ ద్వారా నిగనిగలాడే చర్మం మీ స్వంతమవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కాఫీ స్క్రబ్‌ను ఎలా చేసుకోవాలి? ఎలా వాడాలి? వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం కావాల్సినవి..
- బరకగా దంచిన కాఫీ పొడి - 2 టీస్పూన్లు
- బ్రౌన్ షుగర్ - ఒకటిన్నర స్పూన్లు
- ఆలివ్ నూనె - టీస్పూన్
- తేనె - టీస్పూన్
- పాలు - టీస్పూన్
ఎలా చేసుకోవాలి..
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొవాలి. అందులో పైన చెప్పిన అన్ని పదార్థాలు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి గుండ్రంగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసిన మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొవాలి. 20 నిమిషాల తరువా చల్లటి నీటితో కడిగేసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు.
ఇలా ఈ కాఫీ స్క్రబ్ వేసుకోవాడం వల్ల ఉబ్బిన ముఖాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంతో పాటు పొలుసులుగా ఊడిపోయే చర్మానికి చక్కటి పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. అలాగే ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుందంటున్నారు. ఈ కాఫీ స్క్రబ్‌ని బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..!
ఈ ఫేస్‌మాస్క్ తయారుచేసుకోవడం ఎంతో సులభంగా ఉంది కదా! అంతేకాదు, ఇందులో వాడిన పదార్థాల్లో బోలెడన్ని సౌందర్య రహస్యాలు కూడా దాగున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీలో ఆ లక్షణాలు : కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాతావరణ కాలుష్య ప్రభావం చర్మంపై పడకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు. అలాగే మొటిమలతో పాటుగా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే శక్తి కాఫీకి ఉందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు : బ్రౌన్ షుగర్ చర్మం పొలుసులుగా ఊడే సమస్యను తగ్గించి మృదువుగా, యవ్వనంగా మార్చుతుంది. అలాగే మృతకణాల్ని తొలగిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, గ్లైకోలికామ్లం చర్మానికి మెరుపునందించడంలో సహకరిస్తాయి.