Tips To Make Natural Colours At Home :చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సహంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ రోజున కుల, మత బేధాలు లేకుండా అందరూ ఒక్కటై ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ముఖ్యంగా యూత్ అంతా ఒక్కటై ఫ్రెండ్స్‌తో కలిసి ఆ రోజంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఏటా ఫాల్గుణ మాసం శుక్లం పక్షం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండగను మార్చి 25 సోమవారం రోజు జరుపుకోనున్నారు.
ఇదిలా ఉంటే హోలీ అంటేనే రంగుల పండగ. హోలీనాడు మార్కెట్లో దొరికే రంగు రంగుల కలర్లను ఎక్కువ మంది కొని చల్లుకుంటుంటారు. కానీ, ఇవి తయారు చేయాడానికి చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తారని నిపుణులంటున్నారు. పొరపాటున ఇవి కళ్లలోకి, నోట్లోకి వెళ్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరివసంతాల కేళి హోలీ పండగను రంగులు లేకుండా ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే, మీ కోసమే ఇది. ఇంట్లోనే సహజ సిద్ధంగా రంగులను తయారు చేయడానికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..
పసుపు రంగు :హోలీలో ఎక్కువగా పసుపు రంగును చల్లుకుంటుంటారు. మరి దీనిని ఇంట్లోనే తయారు చేయడానికి శనగపిండి, పసుపును 1:2 నిష్పత్తిలో కలపుకోవాలి. అంతే పసుపు కలర్ రెడీ. అదే కాకుండా పసుపు కలర్ కోసం బంతి, చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు పసుపు రంగులో నీళ్లు కావాలనుకుంటే బంతి పూలను నీటిలో ఉడకబెట్టి తయారు చేసుకోవచ్చు.
రంగుల కేళి.. హోలీ సిద్ధమవుతున్నారా.. అయితే ఇది కూడా తెలుసుకోండి
ఎరుపు రంగు : సహజ సిద్ధంగారెడ్ కలర్ తయారు చేయడానికి కొన్ని ఎర్ర మందార పువ్వులను తీసుకోవాలి. తర్వాత వాటిని ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది తయారు చేయడానికి కాస్త టైమ్ పట్టినా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎర్ర రంగు ఉండటానికి ఇందులో ఎర్ర కుంకుమపువ్వుతో పాటు శనగపిండిని కూడా కలపవచ్చు.