How To Make Masoor Dal Face Pack : చర్మం ఎప్పుడూ తాజాగా, మెరుస్తూ కనిపించాలనే అందరూ కోరుకుంటారు. కానీ కాలుష్యం, దుమ్ము, చమట వంటి రకరకాల కారణాల వల్ల అది సాధ్యం కాని పనిగా మారింది. అందుకే చాలా మంది మార్కెట్లో దొరికే క్రీములు, పార్లర్ల వెంట పడుతున్నారు. అందం కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అన్ని చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదని విసిగిపోయిన వారి కోసం మంచి చిట్కా!. అదే మసూర్ దాల్ ఫేస్ ప్యాక్( Masoor Dal Face Mask). ఎర్రకంది పప్పు లేదా మసూర్ దాల్ విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌గా చేసుకుని రాసుకుంటే అద్భుతమైన ఎక్సఫోలియేట్గా పనిచేస్తుంది. చర్మపు మృతకణాలను తొలగించి ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
మసూర్ దాల్ చర్మాన్ని ఎలా కాపాడుతుంది
ఎర్రపప్పు లేదా మసూర్ దాల్లో ఎక్స్ ఫోలియేటింగ్(exfoliating) గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రకాశవంతమైన, తాజా చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయెగపడే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇందులో బీ కాంప్లెక్స్, విటమిన్-సీ, విటమిన్-ఇలో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని లోతుల నుంచి శుభ్ర పరిచి మంచి పోషణ అందేలా చేస్తుంది.
మసూర్ దాల్ ఫేస్ ప్యాక్‌తో ప్రయెజనాలేంటి?
ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది : మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మురికితో పాటు మృతకణాలను తొలగించి మెరిసే చర్మాన్ని పెంపొందిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ :ఎర్రపప్పులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. చర్య వ్యాధులు, చికాకులు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలను నయం చేస్తుంది.