తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ మూడిట్లో మీ శరీరంలో ఏ దోషం ఉంది? - ఇది తెలియకనే సకల రోగాలు! - how to know the body type

How to Know the Body Type as per Ayurveda: ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో మూడు రకాల దోషాలు ఉంటాయి. అవే వాత, పిత్త, కఫం. ఇందులో ఏ దోషం ఉందనేదానిపైనే మనుషుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఇంతకీ మీలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసా?

How to Know the Body Type as per Ayurveda
How to Know the Body Type as per Ayurveda

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 12:27 PM IST

How to Know the Body Type as per Ayurveda: ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 3 రకాల దోషాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ. ప్రతి దోషం ఒక నిర్ధిష్ట శారీరక పనితీరును ప్రభావితం చేస్తుంది. అయితే.. ఈ రోజుల్లో చాలా మంది తమ శరీరంలో ఎలాంటి దోషం ఉందో తెలియక.. తగిన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే.. మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే.. తమ దోషాన్ని తెలుసుకోవడం చాలా అవసరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒక్కొక్కరిలో ఒక్కోలా..:ఈ మూడు దోషాలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. కొందరిలో వాత దోషం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కఫం లేదా పిత్తం. ఈ దోషాల తీరును బట్టే వారీ శారీరక, మానసిక లక్షణాలు ఆధారపడి ఉంటాయట. ఈ మూడు సమతుల్యంలో ఉన్నపుడే.. మానసిక, శారీరక స్థితి ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.

వాత:ఈ దోషం గాలి మూలకం వల్ల ప్రభావితమవుతుందట. శరీరంలోని అన్ని కదలికలనూ వాతం నియంత్రిస్తుంది. శ్వాస చలనం, హృదయ స్పందన రేటు, కండరాల సంకోచం, కణజాల కదలికలు, నాడీ వ్యవస్థ.. శరీరంలోని అన్ని దిశలకు జరిగే కమ్యునికేషన్​గా చెప్పుకోవచ్చు. కణజాలాల పనితీరు, ఆకలి, దాహం, విసర్జన క్రియ, నిద్ర వంటి శరీరం నిరంతరం నిర్వహించే క్రియలకు వాతం బాధ్యత వహిస్తుందట.

సమతుల్యమైన వాత లక్షణాలు ఉన్నవారుఉత్సాహంగా ఉంటారు. అసమతుల్యమైన వాత లక్షణాలు ఉన్నవారు.. ఆందోళన, నిద్రలేమి, పొడి చర్మం, జీర్ణ సమస్యలు, బరువు పెరగకపోవడం, జలుబు, దగ్గు బారిన ఎక్కువగా పడతారు.

టిప్స్​: తాజా ఆహారాన్ని తినడం, చల్లని వాతావరణాన్ని నివారించడం, యోగా, ధ్యానం వంటివి చేయాలి.

క్యాన్సర్​ టూ గుండె జబ్బులకు చెక్ - కర్బూజతో ఇన్ని ప్రయోజనాలా?

పిత్త: ఈ దోషం అగ్ని మూలకం వల్ల ప్రభావితమవుతుంది. పిత్తం నాభి పైన ఉదరం పైభాగంలో ఉందని ఆయుర్వేదం చెబుతోంది. శరీరంలోని జీవక్రియకు, జీర్ణవ్యవస్థ పనితీరుకు ఇది బాధ్యత వహిస్తుంది. అగ్ని తత్వమైన పిత్త శక్తి శరీరంలోని జీవ క్రియల నిర్వహణ ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది.

సమతుల్యమైన పిత్త లక్షణాలు ఉన్నవారుమంచి శరీరాకృతితో ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. బలమైన కండరాలు ఉంటాయి. శరీరం వెచ్చగా ఉంటుంది. అసమతుల్యమైన పిత్త లక్షణాలు ఉన్నవారు కోపం, చిరాకు, చర్మంపై దద్దుర్ల సమస్యతో బాధపడుతుంటారు.

టిప్స్​: తాజా ఆహారాలను తీసుకోవాలి. మసాలా వంటకాలను తగ్గించుకోవాలి. స్విమ్మింగ్​ చేయాలి.

బరువు తగ్గడం నుంచి షుగర్ కంట్రోల్ దాకా - మెంతులతో సూపర్​ బెనిఫిట్స్ ఎన్నో​!

కఫ:ఇది నీరు, భూమి మూలకాల వల్ల ప్రభావితమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థకు కఫం బాధ్యత వహిస్తుంది. ఇది ఛాతి భాగంలో ఉంటుందని ఆయుర్వేదం వివరిస్తుంది. శరీరానికి బలం, స్థిరత్వాన్ని అందిస్తుంది. కణజాలాలు, కణాలను హైడ్రేట్ చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా కఫమే బాధ్యత వహిస్తుంది.

సమతుల్యమైన కఫ లక్షణాలు ఉన్నవారు సహనంతో ఉంటారు. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. అసమతుల్యమైన కఫ లక్షణాలు ఉన్నవారు బద్ధకం, ఊబకాయంతో బాధపడుతుంటారు.

టిప్స్​:చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం, ఉత్తేజమైన కార్యకలాపాల్లో పాల్గొనడం చేయాలి.

దంతాల్లో రక్తమా? గుండెకు ముప్పు! - ఈ అలవాట్లు ఫాలో కావాల్సిందే!

మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే మీ బాడీలో ఆ సమస్య ఉన్నట్టే!

ABOUT THE AUTHOR

...view details